వరుస హిట్స్‌తో మంచి జోరుమీదున్న జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయంలో నటించిన చిత్రం ‘జై లవకుశ’. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జై, లవ, కుశ అనే మూడు విభిన్న పాత్రలు పోషించగా ఈ చిత్రం పరిపూర్ణమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది.

దసరా కానుకగా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఎన్టీఆర్ కెరీర్‌లో రెండవ అతిపెద్ద హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి తాజాగా అరుదైన గౌర‌వం ల‌భించింది. నార్త్ కొరియాలో జ‌రిగే బిఐఎఫ్ఎఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్‌, బుచియాన్ ఇంటర్నేష‌న‌ల్ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో రెండు రోజుల ప్రదర్శనకి గాను ‘జై లవ కుశ’ సినిమాను ఎంపిక చేశారు.

ఉత్త‌మ ఏషియ‌న్ సినిమా విభాగంలో ‘జై ల‌వ‌కుశ’ చిత్రానికి గౌర‌వం ద‌క్క‌గా, ఈ చిత్రోత్సవంలో చోటు లభించిన ఏకైక తెలుగు సినిమా ‘జై లవ కుశ’ కావడం విశేషం. ‘జై ల‌వ‌కుశ’ చిత్రంలో ఎన్టీఆర్ న‌ట‌న‌కి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లూ ల‌భించాయి. 125 కోట్ల రూపాయల వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కించగా, జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు క‌ళ్యాణ్‌రామ్ నిర్మించాడు. నివేదా థామ‌స్‌, రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌లుగా న‌టించారు.