న్యూఢిల్లీ: ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు నేతృత్వంలో ప్రతినిధుల బృందం బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కె.కె శర్మతో సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని బీఎస్‌ఎఫ్‌ కార్యాలయంలో వీరు సమావేశమయ్యారు. ఏయూతో సంయుక్త అవగాహ ఒప్పందంపై ఇరువర్గాలు చర్చించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం రక్షణ రంగాల ఉద్యోగులకు నిర్వహిస్తున్న వివిధ కోర్సుల వివరాలను వీసీ ఆచార్య నాగేశ్వరరావు బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కె.కె శర్మకు వివరించారు. బీఎస్‌ఎఫ్‌ అధికారులు వర్సిటీతో అవగాహన ఒప్పందం చేసుకోవడానికి ఆసక్తి చూపారు. కార్యక్రమంలో అకడమిక్‌ సెనేట్‌ సభ్యులు డాక్టర్‌ కుమార్‌ రాజ, ఏయూ డిఫెన్స్‌ కార్యక్రమాల సమన్వయకర్త ఉజ్వల్‌ కుమార్‌ ఘటక్‌ తదితరులు పాల్గొన్నారు.