న్యూఢిల్లీ: ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి సంయుక్త పరిశోధనలు నిర్వహించడానికి భారత నావికా దళం తన సంసిగ్ధతను వ్యక్తం చేసింది. భారత నావికాదళం ప్రధాన అధికారి అడ్మిరల్‌ సునిల్‌ లాంబాను న్యూఢీల్లీలో ఆయన కార్యాలయంలో ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య జి. నాగేశ్వరరావు కలిసారు. ఈ సందర్భంగా సునిల్‌ లాంబా మాట్లాడుతూ నావికాదళం బృందాన్ని త్వరలో ఏయూకి పంపుతామని ఏయూ తో పరిశోధనా పర ఓప్పందం కుదుర్చుకుంటామని అన్నారు.

వైస్‌ ఛాన్సలర్‌ జి. నాగేశ్వరరావు మాట్లాడుతూ నావికాదళం అదికార్లుకు, సిబ్బందికి ఇప్పటికే ఏయూ వివిధ కోర్సులను అందిస్తుందన్నారు. నావికాదళ సిబ్బందికి పరిశోధన పరమైన అంశాలను కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏయూ న్యూఢీల్లీ పూర్వ విద్యార్థిసంఘం కార్యదర్శి డాక్టర్‌ షేక్‌ సులేమాన్‌, ఏయూ ఇ.సి మెంబర్‌ డాక్టర కుమార్‌ రాజా,ఏయూ డిఫెన్స్‌ జాయింట్‌ ఎడ్యుకేషనల్‌ అధికారి ఉజ్వల్‌ కుమార్‌ ఘటక్‌ తదితరులు పాల్గోన్నారు.