విశాఖపట్నం: ఆంధ్రవిశ్వవిద్యాలయం జర్నలిజం విభాగంలో నిర్వహిస్తున్న డిప్లమో ఇన్‌ సాఫ్ట్‌స్కిల్స్‌, డిప్లమో ఇన్‌ ఫోటోగ్రఫీ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జర్నలిజం విభాగం ఆచార్యులు డి.వి.ఆర్‌ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీలో చదువుతున్న, అనుబంధ కళాశాలల విద్యార్థులు, పౌరులు ఈ కోర్సులో చేరడానికి అర్హులన్నారు.

ఆరునెలల కాలవ్యవధితో సాయంకాలం వేళ నిర్వహించడం జరుగుతుందన్నారు. కోర్సులకు ప్రవేశ రుసుముగా రూ 10 వేలు చెల్లించాలన్నారు. ఆసక్తి కలిగిన వారు ఆగష్టు 6వ తేదీలోగా తమ దరఖాస్తులను ప్రవేశాల సంచాలకులు కార్యాలయంలో అందజేయాలన్నారు.