విశాఖపట్నం: తెలుగు భాషా ప్రాధికార సమితిని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతూ యువ నాయకుడు ఆడారి కిశోర్‌కుమార్ నాయకత్వంలో ఆదివారం విశాఖ మద్దిలపాలెం కూడలిలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద భాషాభిమానులు నిరసన తెలియజేశారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భాషాభివృద్ధి అంతంత మాత్రంగానే జరుగుతోందని, తెలుగును కాపాడుకునే ఉద్యమానికి ప్రభుత్వం స్పందించి తెలుగు భాషా ప్రాధికార సమితిని ఏర్పాటుచేయాలని కిశోర్‌కుమార్ డిమాండు చేశారు. ప్రాధమిక స్థాయి నుంచి పిల్లలకు తెలుగు భాషను తప్పనిసరి చేసి తెలుగు విరాజిల్లేలా చర్యలు చేపట్టాలన్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here