• ఆనంద ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యమని ప్రకటన

  • శ్రీకాకుళం వేదికగా రాష్ట్రస్థాయి స్వాతంత్ర్య దినోత్సవాలు

శ్రీకాకుళం: ఎందరో మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్య్రమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో బుధవారం నిర్వహించిన 72వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు పతకాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఒక్కో ఏడాది ఒక్కో జిల్లాలో స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకుంటున్నామని, తొలి నాలుగేళ్లలో కర్నూలు, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి జిల్లా కేంద్రాలలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించామని, ఈసారి శ్రీకాకుళంలో జెండా పండుగ జరుపుకుంటున్నామన్నారు.

‘‘శ్రీకాకుళం జిల్లా ఎందరో గొప్పనేతలకు నిలయం. 2029 నాటికి దేశంలోనే అగ్ర రాష్ట్రంగా ఏపీ నిలబడాలి. ఎన్ని అవరోధాలు ఎదురైనా లక్ష్యం దిశగా సాగుతున్నాం. ఆర్ధిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం. విభజనతో నష్టపోయినా అభివృద్ధి ఆగకుండా చూశాం. నాలుగేళ్లలో రెండంకెల అభివృద్ధి సాధించాం. సంకల్ప బలం ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించగలం. వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టి వరి దిగుబడులు పెంచాం. రైతులకు రూ.24,500 కోట్ల రుణవిముక్తి చేశాం. రాష్ట్రంలో అందరూ ఆనందంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆనంద ఆంధ్రప్రదేశ్‌ దిశగా ప్రభుత్వ అడుగులు వేస్తోంది’’ అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here