తెలుగు తెరపై మరో సరికొత్త ప్రేమకథ సందడి చేయనుంది. సంతోష్‌ శోభన్‌, రియా సుమన్‌, తన్య హోప్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పేపర్‌బాయ్‌’. జయ శంకర్‌ దర్శకుడు. సంపత్‌ నంది టీమ్‌ వర్స్క్‌ పతాకంపై సంపత్‌ నంది ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

టైటిల్‌తోనే ఆకట్టుకున్న ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. ‘‘ఐదున్నరడుగుల సాంప్రదాయం తను. యాభై కిలోల తెలుగుదనం తను. అందుకే ఐదేళ్లుగా ప్రతీ రోజు వెళ్లి చూసి గుడ్‌మార్నింగ్‌ చెప్పి వస్తున్నా’’ అంటూ కథానాయకుడి వాయిస్‌తో ఆరంభమైన టీజర్‌ ఆద్యంతం అలరించేలా సాగింది. మరి వెండితెరపై ఈ ప్రేమకథ ఎలా ఉంటుందో చూడాలి.

‘బీటెక్‌ చేసి, న్యూస్‌ పేపర్‌ వేస్తున్నావా’ అని కథానాయిక హీరోను ప్రశ్నిస్తే, ‘‘అది బతకడం కోసం, ఇది భవిష్యత్‌ కోసం’’ అంటూ కథానాయకుడు చెప్పే డైలాగ్‌ నిత్యం కష్టపడే నేటి యువత మనస్తత్వానికి అద్దం పడుతోంది. భీమ్స్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here