• పార్ధివదేహాన్ని సందర్శించిన సీఎం

  • సంస్కరణలవాదిని దేశం కోల్పోయిందని వ్యాఖ్య

న్యూఢిల్లీ: అన్ని సంస్కరణలకు ఆద్యుడు అటల్ బిహారీ వాజ్‌పేయి అని, ఆయనకు ఎవరూ సాటిరారని, ఆయన మృతి దేశానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు కృష్ణ మీనన్‌ మార్గ్‌లోని వాజ్‌పేయి నివాసానికి చేరుకున్నారు. ఆయన పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘వాజ్‌పేయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. మంచి నిర్ణయంపై సానుకూలంగా ఆలోచించేవారు. నమ్మకున్న సిద్ధాంతాల కోసం కట్టుబడి చివరి వరకూ ఉన్నారు’’ అని అన్నారు. ఎన్డీయేలో వాజ్‌పేయి నాయకత్వంలో తమ భాగస్వామ్యాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు కన్నీటిపర్యాంతరమయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here