హైదరాబాద్: నాలుగు రోజుల పర్యటనలో భాగంగా గురువారంనాడు బేగంపెట్ మెట్రో రైల్వే భవన్‌లో ఆఫ్రికా జర్నలిస్టుల బృందంతో ఎం.డి. ఎన్వీఎస్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రోకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని, ప్రపంచంలోనే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన తొలి భారీ ప్రాజెక్టు అని ఆయన అన్నారు.

హైదరాబాద్ మెట్రోను తొలుత అసాధ్యమని అన్నారని, ఈ ప్రాజెక్ట్‌ని సుసాధ్యం చేసి చూపించామని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు స్టేషన్లను ప్రిక్యాస్టింగ్ విధానంలోనే నిర్మించడం జరిగిందని తెలిపారు. మెట్రో రైల్వే వ్యవస్థ పొడవు 72 కిలోమీటర్లకు పైగా ఉందని, ఆకాశంలో ఎగిరే పక్షిని స్ఫూర్తిగా తీసుకోని రైల్వే స్టేషన్లను డిజైన్లు చేసినట్లు వివరించారు.

హైదరాబాద్ పట్టణంలో రోజు రోజుకి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రవాణా వ్యవస్థను మెరుగు పర్చడానికి ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు వివరించారు. ప్రతి రోజు మెట్రోలో దాదాపు లక్ష మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని, ప్రయాణికుల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు ఆయన అన్నారు. అంతకు ముందు ఆఫ్రికా జర్నలిస్టుల బృందం అమీరుపేట రైల్వే స్టేషన్ నుండి రసూల్పురా రైల్వే స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here