• కేరళ ఉదంతం నేపథ్యంలో నిర్ణయం

  • వరద బాధితులను ఆదుకోవాలని పిలుపు

  • తెలుగు రాష్ట్రాల దాతలను కోరిన గవర్నర్

హైదరాబాద్: అధికారికంగా ప్రభుత్వం నిర్వహించే ఏ జాతీయ పండుగకైనా వేదికగా నిలుస్తుంటుంది రాజ్‌భవన్‌. మరీ ముఖ్యంగా జాతీయ సమగ్రతను చాటే సంప్రదాయ ఉత్సవాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. ఆయా ఉత్సవాలలో గవర్నర్ కుటుంబం, రాజ్‌భవన్ ఉద్యోగులు, అందులో నివాసం ఉంటున్న సిబ్బందితో కలిసి ఉల్లాసంగా గడుపుతుంది.

అయితే, ఈ ఏడాది రాఖీ పర్వదిన వేడుకలను నిర్వహించరాదని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నిర్ణయించారు. కేరళ వరద బీభత్సం, అక్కడి ప్రజలు పడుతున్న కష్టాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గవర్నర్ కార్యాలయం శుక్రవారం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు తమకు తోచినంతగా కేరళ రాష్ట్రానికి ఇతోధికంగా సాయం చేయాలని గవర్నర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.