హైదరాబాద్: తెలంగాణ నూతన జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం తెలుపడం పట్ల తెలంగాణ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. గురువారం సచివాలయంలో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ. పద్మాచారి, కార్యదర్శి పవన్ కుమార్ గౌడ్ అసోసియేట్ ప్రెసిడెంట్ ఎం. రవీందర్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్నికి, అదే విధంగా నూతన జోనల్ విధానానికి నిర్విరామంగా కృషి చేసి ప్రధానమంత్రిని ఒప్పించి కొత్త జోనల్ విధానాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలంగాణ ఉద్యోగుల సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాల నుంచి విముక్తే తెలంగాణ సాధన అని వారు పేర్కొన్నారు. నియామకాల విషయంలో ప్రాంతీయ అసమానతలు ఉండకూడదని, జోనల్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికి సమన్యాయం జరగాలని భావించిన కేసీఆర్ పట్టుబట్టి కేంద్రాన్ని ఒప్పించి నూతన జోనల్ విధానినాన్ని తీసుకురావడం గొప్ప విషయంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ నూతన విధానం వల్ల ఆయా జిల్లాలో ఉన్న లోకల్ నిరుద్యోగులకు 95 శాతం మిగతా 5 శాతం ఓపెన్ కోట జిల్లా, జోనల్, మల్టిజోన్లలో రిజర్వేషన్ ఉండడం వల్ల అందరికి న్యాయం జరుగుతున్నదన్న ఆశాభావం వ్యక్తం చేసారు. ఇదే తెలంగాణ సాధన ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. అతి త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వస్తాయని భావిస్తున్నామని, కొత్త ఉద్యోగాలల్తో ఉన్న ఉద్యోగులకు పని వత్తిడి తగ్గి ప్రభుత్వ సేవలు ప్రజలు ఇంకా బాగా అందుతాయని వారు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here