అమరావతి: నానో క్షిపణిని అభివృద్ధి చేసినందుకు వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందిన ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన విద్యార్ధి డి. పాండురంగ రోహిత్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు. శుక్రవారం రోహిత్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి తనకు లభించిన గుర్తింపును గురించి వివరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు రోహిత్‌ పరిశోధనను, విజ్ఞానాన్ని మెచ్చుకుని సన్మానించారు. ప్రస్తుతం చెన్నైలోని ఎస్.ఆర్.ఎమ్. యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థి రోహిత్ ఈ నానో క్షిపణిని ఉగ్రవాదంపై పోరాటంలో భారతీయ సైన్యం, స్థానిక పోలీసుల వాడకం కోసం డీఆర్‌డీవోకు అప్పగించాలని కోరుకున్నాడు. రోహిత్ ఒక సెంటీమీటర్ పొడవు క్షిపణిని సిద్ధం చేసి రికార్డు నెలకొల్పాడు.

ఇది ఎర్ర భాస్వరం దహించడం ద్వారా ఎగురుతుంది. 3 మీటర్ల దూరంలో లక్ష్యాన్ని చేరుకుని తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఇంధనం బరువు తగ్గించడానికి, మరింత థ్రస్ట్‌ను అందించడానికి రోహిత్ ప్రస్తుతం పని చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here