హైదరాబాద్: శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్బన్ మిషన్ పథకం నిర్వహణలో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుండి తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖకు వర్తమానం అందింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్బన్ మిషన్ పథకం రాష్ట్రంలో సమర్దవంతంగా నిర్వహణ చేపట్టినందుకు ‘ఉత్తమ రాష్ట్రం’ రుర్బన్ మిషన్ అమలు కేటగిరిలో జాతీయ అవార్డుకు ఎంపిక చేశారు.

ఈనెల 11న అవార్డును అందజేయనున్నారు. ఈ పురస్కారానికి జాతీయ స్థాయిలో ఎంపిక చేసిన మూడు రాష్ట్రాలలో తెలంగాణను ఒకటి. ఈ పురస్కారాన్ని భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రదానం చేయనుంది. ఈనెల 11న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, ఎస్‌జె ఆశ తదితరులు పాల్గొననున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here