హైదరాబాద్: నగర శివార్లలోని గచ్చిబౌలి చౌరస్తాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సిటీ ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వేగంగా వస్తున్న బస్సు బస్ స్టాప్‌లో నిల్చున్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టిందని, ఈ ప్రమాదంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇదిలావుండగా, మరో పదినిమిషాల్లో విధులకు హాజరుకావాల్సిన ఆర్టీసీ కండక్టర్‌ ఒకరు డిపోకు కూతవేటు దూరంలోనే అదుపుతప్పిన కారు ఢీ కొట్టడంతో దుర్మరణం పాలయ్యాడు. డ్యూటీ ఎక్కడానికి వస్తాడనుకుంటే చావుకబురు రావడంతో తోటి ఉద్యోగులందరూ హతాశులయ్యారు.

ఘటనా స్థలంలోనే విగతజీవిగా పడి ఉన్న సన్నిహితుడిని చూసి ఆర్టీసీ ఉద్యోగులంతా కన్నీరు మున్నీరయ్యారు. అదే ప్రమాదంలో నిజాం కాలేజీ ఉద్యానంలో తొటమాలిగా పనిచేసేందుకు తన వాహనంపై వెళుతున్న మరో వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ సంఘటన చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషను పరిధిలో జరిగింది. యాఖుత్‌పురా బ్రాహ్మణవాడిలో నివసించే డి.సత్యనారాయణ (57) ఫలక్‌నుమాలోని ఫారూఖ్‌నగర్‌ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

యాఖుత్‌పురా రైల్వేస్టేషన్‌ నుంచి ఎంఎంటీఎస్‌ రైలు ఎక్కి ఫలక్‌నుమా రైల్వేస్టేషన్‌లో దిగి నడుచుకుంటూ దగ్గరలోని ఆర్టీసీ డిపోకు రోజూ వెళ్తున్నాడు. ఉదయం 5.30 గంటలకు ఫలక్‌నుమా స్టేషన్‌లో రైలు దిగి కాలినడకన ఫలక్‌నుమా రైల్వే ఓవర్‌ బ్రిడ్జిపైకి రాగానే ఇంజన్‌బౌలి నుంచి అతి వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు (ఏపీ 13 కె – 3748) సత్యనారాయణను ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే దర్మరణం పాలయ్యాడు. అదుపు తప్పిన కారు చాంద్రాయణగుట్ట నుంచి ఫలక్‌నుమా వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. వెంటనే కారుతో సహా యజమాని పరారయ్యాడు.

వాహనంపై వెళుతున్న సయ్యద్‌ షరీఫ్‌కు తీవ్ర గాయాలు కాగా అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో దుర్మరణం పాలైన ఆర్టీసీ కండక్టర్‌ డి.సత్యనారాయణ ఈ ఏడాది డిసెంబరులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, పన్నెండేళ్ల కుమారుడు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన కారు నంబరు ఎవరూ గుర్తించలేదు. సీసీ కెమెరా ఫుటేజీల్లో చూడగా సగం నంబరు మాత్రమే కనిపించింది.

తమ వద్ద ఉన్న ప్రత్యేక పరిజ్ఞానంతో పోలీసులు ప్రయత్నించగా కారు నంబరు తెలిసింది. దీని ఆధారంగా హబీబ్‌నగర్‌లోని కారు యజమాని మహ్మద్‌ హమీద్‌ను విచారించగా ఏడాది క్రితం కారును సలాలా కొత్తపేట్‌లోని అబ్దుల్‌ రహీంకు విక్రయించినట్లు చెప్పాడు. దీంతో అక్కడికి వెళ్లగా అబ్దుల్‌ రహీం పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here