• లక్ష ఎకరాలకు నీళ్లిచ్చే బాధ్యత తనదని ప్రకటన

  • ‘ఉరిసిల్ల’ను ‘సిరిసిల్ల’గా మార్చామని వెల్లడి

సిరిసిల్ల: డెబ్లై ఏళ్ల అభివృద్ధిని కేవలం నాలుగున్నరేళ్లతో చేసి చూపించానని, భవిష్యత్తులో కూడా సిరిసిల్ల అభ్యున్నతే లక్ష్యంగా తాను పనిచేస్తానని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు.

‘‘నా తల్లి నాకు జన్మనిస్తే సిరిసిల్ల గడ్డ రాజకీయ జన్మనిచ్చింది. మీ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రినైనా. ఎక్కడా తలవంపులు తేకుండా మీరందరూ గర్వపడేలా పనిచేస్తున్నా. ఆత్మహత్యలతో ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను, సిరులసిల్లాగా మార్చాం. ఊరూరా ప్రగతిని పరుగులు పెట్టించాం. ఇప్పుడు మీ బిడ్డగా మళ్లీ మీ ముందుకు వస్తున్నా. ఆశీర్వదించండి. ఆఖరి శ్వాస వరకూ మీ కోసం పనిచేస్తా. ఈ గడ్డ రుణం తీర్చుకుంటా అని కేటీఆర్ ఉద్విగ్నంగా మాట్లాడారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గత మూడు ఎన్నికల్లో కన్నబిడ్డలాగా ఆదరించిన మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లననీ, రాజకీయాల్లో ఉన్నంత కాలం సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

‘‘నేను ఎక్కడా తలవంపులు తేకుండా మీరందరూ గర్వపడేలా పనిచేస్తున్న. మీ బిడ్డగా మళ్లీ మీ ముందుకు వస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. ఆఖరి శ్వాస వరకు సిరిసిల్ల అభివృద్ధి కోసం పనిచేస్తా అని అన్నారు. సామన్య కార్యకర్తగా పార్టీలో ప్రస్థానాన్ని ప్రారంభించానని, 2006 నుంచే సిరిసిల్లతో తనకు ప్రత్యేక అనుబంధముందని గుర్తు చేశారు. ఆ నాడు యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఉన్న కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారని, ఉద్యమాన్ని నిలబెట్టేందుకు అమెరికాలో ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చానని, ఉప ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు కోసం ప్రజలతో మమేకమై పనిచేశానని వివరించారు. రాజకీయ జీవితంలోకి ప్రవేశించాక మొట్టమొదటి కార్యకర్తల సమావేశానికి ఎల్లారెడ్డిపేటలోనే హాజరయ్యానని తెలిపారు.

అనివార్యమైన సందర్భంలో తాను 2009 ఎన్నికల్లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వచ్చిందని, అనేక ప్రతికూల పరిస్థితుల్లో కేవలం 171 ఓట్లతో ప్రజలు గెలిపించారని, తిరిగి ఆరు నెలల అనంతరం 2010లో వచ్చిన ఉప ఎన్నికల్లో 50 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో అదే ప్రజలు తనను గెలిపించిన విషయాన్ని ఎన్నటికీ మార్చిపోనని వివరించారు. 2014లో సైతం అదే ఉత్సాహంతో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కేసీఆర్ దయతో మంత్రిగా పనిచేసే అవకాశం లభించిందని కృతజ్ఞతలు తెలిపారు.

మూడు ఎన్నికల్లో కన్నబిడ్డలాగా ఆదరించిన వారిని వదిలిపెట్టి ఎక్కడికో పోయి నేను ఎందుకు పోటీ చేస్తా. రాజకీయాల్లో ఉన్నంత కాలం సిరిసిల్ల నుంచే పోటీ చేస్తా’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. నాలుగున్నరేళ్లలో సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి గల్ఫ్ వెళ్లి వచ్చిన వారు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. ఇతర దేశాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారు ఇక్కడ జరిగిన పనులను చూసి ఇవి తమ ఊళ్లేనా అని విస్తుపోతున్నారని వివరించారు. సిరిసిల్ల నుంచి మండల కేంద్రాలకు వెళ్లే ప్రతి రోడ్డునూ డబుల్ రోడ్డుగా మార్చామని, ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు వేశామని, మూడు జిల్లాలను కలిపే శ్రీగాధ, బీబీపేట బ్రిడ్జీ పూర్తి చేశామని, నియోకవర్గవ్యాప్తంగా అనేక వంతెనలు నిర్మించామని, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో రోడ్లు విస్తరణ పనులు చేపట్టామని, గిరిజన తండాలను కలుపుతూ రింగురోడ్లు నిర్మించిన విషయం అందిరికీ తెలుసని పునరుద్ఘాటించారు.

వ్యవసాయ పాలిటెక్నిక్, ఐటీఐ, వ్యవసాయ, నర్సింగ్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేద్దామంటే ఖాళీలేని విధంగా గల్లీగల్లీకి అంతర్గత రోడ్లు వేశామని అన్నారు. ‘‘సిరిసిల్ల ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన ఎగువ మానేరు ఎత్తిపోతల పథకం వచ్చే డిసెంబర్ వరకు పూర్తవుంది. త్వరలోనే లక్ష ఎకరాలకు గోదావరి జలాలు అందించే బాధ్యత నాదే. మిడ్ మానేరు నుంచి మల్కపేట రిజర్వయర్ వరకు దాదాపు పనులు పూర్తయ్యాయి. రిజర్వయర్ నిర్మాణం కొనసాగుతోంది. పనులు పూర్తికాగానే, మల్కపేట నుంచి ఎగువమానేరు కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతుంది’’ అని కేటీఆర్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

రానున్న రోజుల్లో సిరిసిల్ల రాష్ట్రస్థాయి ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తామని, ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత తప్పకుండా ఉంటుందనీ, రానున్న ఐదేళ్లలో ప్రతీ కార్యకర్తకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. గడిచిన నాలుగేళ్లలో పార్టీకి పనిచేసిన వారికి కొంత మందికి మాత్రమే పదవులు వచ్చాయనీ, రానివారు ఎవరూ బాధపడవద్దనీ, అవకాశాలు అందరికీ వస్తాయని హామీ ఇచ్చారు. పదవులున్నా, లేకున్నా అభివృద్ధి కోసం పనిచేయాలని, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా కార్యకర్తలు ఉండాలని సూచించారు. పార్టీని నమ్ముకొన్న వారందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు.

ఆత్మహత్యలతో ఘోషిల్లుతూ ఉరిసిల్లాగా అపఖ్యాతిని అంటగట్టుకున్న సిరిసిల్లను సిరులసిల్లాగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. పని, వేతనాలు లేక ఆకలితో అలమటిస్తున్న నేత కార్మికుల జీవితాల్లో శాశ్వత వెలుగులు తీసుకువచ్చేలా పని చేశామని గుర్తుచేశారు. రూ.300 కోట్ల విలువైన గుడ్డ తయారీ బాధ్యతను ఇక్కడి కార్మికులకు అప్పగించి వారు నెలకు రూ.15 నుంచి 20 వేల జీతం పొందేలా చేశామని వివరించారు. గతంలో నెలలో పది రోజులు పని దొరికేదని, ఇప్పుడు చేసుకున్నోళ్లకు చేసుకున్నంత పని ఉందని అన్నారు. తాత్కలిక ప్రయోజనాలను కాకుండా కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించేందుకు అపెరల్ పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

సిరిసిల్ల పట్టణ సుందరీకరణను చేపట్టి అన్ని జిల్లా కేంద్రాలకు దీటుగా తయారు చేశామన్నారు. కొత్తగా ఏర్పడిన ఏ జిల్లా కేంద్రంలో జరగని అభివద్ధి కేవలం సిరిసిల్లలోనే చేశామని వివరించారు. సిరిసిల్ల చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందని గుర్తుచేశారు.

4 COMMENTS

  1. I would like to express appreciation to you just for rescuing me from this particular incident. As a result of browsing throughout the the net and getting recommendations which were not pleasant, I figured my entire life was gone. Existing minus the strategies to the issues you have fixed by way of your good guideline is a critical case, and ones which could have in a negative way damaged my career if I hadn’t encountered your website. Your knowledge and kindness in maneuvering the whole thing was tremendous. I don’t know what I would have done if I had not encountered such a subject like this. I am able to at this moment look forward to my future. Thanks for your time very much for this expert and results-oriented guide. I will not be reluctant to recommend your web blog to any person who needs and wants assistance on this issue.

  2. I have to show my passion for your kind-heartedness giving support to people who require guidance on that area. Your real commitment to passing the message across was unbelievably significant and have continually empowered individuals much like me to achieve their endeavors. Your warm and helpful key points implies a great deal to me and even more to my office workers. Best wishes; from all of us.

  3. I am glad for commenting to let you be aware of what a fabulous experience my girl encountered visiting your site. She realized too many things, most notably how it is like to possess an excellent teaching mood to get other people clearly know just exactly various multifaceted subject matter. You truly surpassed my expected results. I appreciate you for imparting the helpful, healthy, educational and in addition unique guidance on that topic to Kate.

  4. I want to express appreciation to this writer just for rescuing me from this problem. Because of searching throughout the search engines and seeing advice which are not helpful, I thought my entire life was done. Existing without the presence of answers to the problems you have resolved as a result of this short article is a critical case, as well as those that would have in a wrong way affected my career if I hadn’t noticed your web page. Your own personal training and kindness in taking care of all things was very helpful. I’m not sure what I would have done if I had not encountered such a step like this. I can also at this moment look ahead to my future. Thank you very much for this high quality and result oriented guide. I will not think twice to suggest the sites to any person who should get guidance about this area.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here