• విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పిల్లల విభాగంలో మంటలు

  • ముథోల్ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్ధుల అదృశ్యం

వరంగల్: వరంగల్‌‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రిలో గురువారం మరో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. పిల్లల విభాగంలో ఏసీ షార్ట్ సర్క్యూట్ అవడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో రోగులు, వారి బంధువులు ఆందోళన చెందారు. వార్డు మొత్తం పొగలు కమ్ముకోవడంతో భయాందోళనతో పిల్లలను తల్లిదండ్రులు బయటికి తీసుకువచ్చారు. దీంతో పెను ముప్పు తప్పినట్లయింది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇదిలావుండగా, ఆదిలాబాద్ జిల్లా ముథోల్‌లో గురుకుల పాఠశాల విద్యార్థులు అదృశ్యమయ్యారు. గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి నవీన్, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి మధు కనిపించడం లేదు.

విద్యార్థులు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో పాఠశాల యాజమాన్యం గురువారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. బాసర రైల్వే స్టేషన్‌లో సీసీ కెమెరాలో విద్యార్థుల దృశ్యాలు గుర్తించినట్లుగా పోలీసులు తెలిపారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here