మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో ‘వనం మనం’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 70 లక్షల మొక్కలను నాటడం జరిగందిని జిల్లా కలెక్టరు బి. లక్ష్మీకాంతం తెలిపారు.

శనివారం జిల్లా పరిషత్ కార్యాలము నుండి కోనేరు సెంటరు వరకు విద్యార్థినీ, విద్యార్థులు, ప్రజలతో పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ప్రజలందరూ సమిష్టంగా పర్యావరణ సమతుల్యాన్ని దృష్టిలో ఉంచుకొని మొక్కలు నాటి మానవుని మనుగడకు అవసరమైన ప్రాణవాయువును కాపాడాలని అన్నారు.

కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

  • ‘మీకోసం’ వేదిక మార్పు

కృష్ణా జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమం అక్టోబరు 1వ తేదీ సోమవారం మచిలీపట్నం జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించబడుతుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించవలసిందిగా జిల్లా కలెక్టరు బి. లక్ష్మీకాంతం ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here