విశాఖపట్నం: ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన ది కమ్యూనికోన్స్‌ ఏయూసీఈ (ఏ) ఇంగ్లీష్‌ క్లబ్‌ రెండురోజుల సాంసృతిక, సాంకేతిక ఉత్సవం శనివారం సాయంత్రం ముగిసింది. ఉదయం వైవిఎస్‌ మూర్తి ఆడిటోరియం వేదికగా స్పెల్‌ బి, వర్క్‌షాప్‌, క్విజ్‌, పోయట్రీ పోటీలను నిర్వహించారు. వర్సిటీ విద్యార్థులతో పాటు నగరంలోని పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్నారు. సాయంత్రం నిర్వహించిన ముగింపు వేడుకల్లో స్వాగత నృత్యం చిన్నారి ఇషిత ప్రదర్శనతో ప్రారంభమైంది.

అనంతరం విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. విద్యార్థుల సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఆచార్య పి.ఎస్‌ అవధాని, ఆచార్య ఇందిర, సంస్థ వ్యవస్థాపకురాలు ఫాతిమా, నరసింహం, సీటీసీ సంస్థ నిర్వాహకులు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అభిషేక్‌, బి.రేవతి, పి.అరవింద, తన్మయి, లహరి, యశ్వంత్‌ తదితరులు సమన్వయం చేశారు.