కాకినాడ: పరిశీలకుల బృందం సిఫార్సు మేరకు వి.శైలజ సిద్ధాంత వ్యాసం ‘ఇంపాక్ట్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ సిస్టమ్స్‌ ఆన్‌ ఆర్గనైజేషనల్‌ పెర్ఫార్మెన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ రిటైల్‌ సెక్టార్‌ – ఏ స్టడీ ఆన్‌ ఫుడ్‌ అండ్‌ గ్రాసరీస్‌ రిటైల్‌ ఎట్‌ హైదరాబాద్‌ సిటీ’ జెఎన్‌టియుకె అధికారులచే ఆమోద ముద్ర పొందింది. ఈ మేరకు ఆమెకు పీహెచ్‌డీ (డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ) అవార్డు మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగంలో లభించింది.

వి.శైలజ తన సిద్ధాంత వ్యాసాన్ని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని అమిటీ గ్లోబల్‌ బిజినెస్‌ స్కూల్‌ డైరెక్టర్‌ డాక్టర్ పి. ప్రసాదరావు, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ ఫ్యాకల్టీ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ రిటైర్డ్‌ డీన్‌ డాక్టర్ ఎ. సూర్యనారాయణ ఆధ్వర్య పర్యవేక్షణలో సమర్పించారు.