హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ టైటిల్ సాధించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఆసియా కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజేతగా నిలవడం అరుదైన విజయంగా ఆయన అభివర్ణించారు.

భారత జట్టు అన్ని రంగాల్లో రాణించిందని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో రానున్న మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.