• కాలుజారి ధర్మారెడ్డి తలకు తీవ్ర గాయం

వరంగల్: వరంగల్ జిల్లాకు చెందిన పరకాల టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడ్డారు. తన ఇంట్లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడటంతో ఎమ్మెల్యే తలకు తీవ్ర గాయమైంది. అయితే, ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాత్రూంలో కాలుజారి పడటంతో ధర్మారెడ్డి  తలకు తీవ్ర గాయమైంది.

దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. ఆయనకు చికిత్స చేసిన వైద్యులు రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ధర్మారెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగానే వున్నట్లు వైద్యులు తెలిపారు.