న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్ల తయారీ రంగ సంస్థ సెల్‌కాన్‌ ‘క్యాంపస్‌ నోవా ఏ352ఈ’ పేరుతో చవకైన స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఒపేరా మినీ మొబైల్‌ బ్రౌజర్‌ను ప్రీ-ఇన్‌స్టాల్‌ చేశారు. ఇందుకోసం ఒపేరా సాఫ్ట్‌వేర్‌తో ఒప్పం దం చేసుకుంది. ఆన్‌డ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌ను 3.5 అంగుళాల స్క్రీన్‌, 256 ర్యామ్‌, 512 ఎంబీ ఇంటర్నల్‌ మెమరీ, 1 గిగాహెర్ట్జ్‌ ప్రాసెసర్‌, 2 ఎంపీ కెమెరా, జీపీఆర్‌ఎస్‌, ఎడ్జ్‌, వైఫై వంటి ఫీచర్లతో రూపొందించారు. ధర రూ.2 వేలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి ఫీచర్లతో ప్రపంచంలోకెల్లా చౌక స్మార్ట్‌ఫోన్‌ ఇదేనని సెల్‌కాన్‌ ఈడీ మురళి రేతినేని ఈ సందర్భంగా చెప్పారు. తొలుత ఆన్‌లైన్‌లో స్నాప్‌డీల్‌ ద్వారా, దీపావళి నుంచి దేశవ్యాప్తంగా రిటైల్‌ మార్కెట్లోకి తీసుకొస్తామని తెలిపారు. లక్ష ఫోన్లు విక్రయించే అవకాశం ఉందన్నారు.

విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో స్మార్ట్‌ఫోన్‌ను దీపావళికి ప్రవేశపెట్టనున్నట్టు సెల్‌కాన్‌ సీఎండీ వై.గురు తెలిపారు. 4 అంగుళాల స్క్రీన్‌, క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌, 512 ర్యామ్‌, 4 జీబీ ఇంటర్నల్‌ మెమరీతో తీసుకొస్తున్నట్టు చెప్పారు. రూ.6 వేలలోపు ధర ఉంటుందన్నారు. డ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌, 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ ఇంటర్నల్‌ మెమరీతో కూడిన ట్యాబ్లెట్‌ పీసీ సైతం రానుందని చెప్పారు.

కాగా, ఒపేరా బ్రౌజర్‌ ప్రీ-ఇన్‌స్టాల్‌ చేసిన నోకియా ఫోన్లు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని ఒపేరా సాఫ్ట్‌వేర్‌ దక్షిణాసియా వైస్‌ ప్రెసిడెంట్‌ సునీల్‌ కామత్‌ వెల్లడించారు. నోకియా భవిష్యత్‌ ఫోన్లు తమ కంపెనీ బ్రౌజర్‌తో రానున్నాయన్నారు. ఒపేరా మినీ బ్రౌజర్‌ వాడకం భారత్‌లో 2013 నుంచి 24% వృద్ధి చెందిందని చెప్పారు. భారత్‌కు చెందిన 16 మొబైల్‌ కంపెనీలు ఆపెరాతో చేతులు కలిపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here