• నేడు లాల్‌ బహాదుర్‌శాస్త్రి జయంతి సందర్భంగా…

మహాత్మాగాంధీ తర్వాత జాతి గుర్తించుకునే వ్యక్తుల్లో లాల్‌ బహాదుర్‌శాస్త్రి ఒకరు. భారతదేశానికి రెండవ శాశ్వత ప్రధానమంత్రిగా, అంతకముందు స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ పాత్రధారిగా శాస్త్రి నిర్వర్తించిన పాత్ర పదాల్లో చెప్పలేనిది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మొగల్‌ సరాయ్‌ గ్రామంలో లాల్‌ బహదూర్‌ 1904 అక్టోబర్‌ 2న శారదా ప్రసాద్‌, రామ్‌దులారీ దేవీలకు జన్మించాడు.

తండ్రి శారదాప్రసాద్‌ రాయ్‌ ఒక నిరుపేద. బతకలేక బడిపంతులు అని అనుకుంటున్న ఆ రోజుల్లో ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతికష్టంగా తన కుటుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత జన్మించిన లాల్‌ బహదూర్‌ను చూసుకొని ఆ తల్లిదండ్రులెంతో మురిసిపోయారు.

బ్రిటీషు దాస్యశృంఖాలలో మగ్గిపోతున్న భారతదేశాన్ని స్వంతంత్రంగా చేయాలని అప్పటికే కృషి చేస్తున్న జన్మదినమైన అక్టోబరు 2వ తారీఖునే, తమకు కుమారుడు కలగటం, ఆ దంపతులకు మరీ ఆనందం కలుగచేసింది. నిరాడంబరతకు తోడు ఎంతో అభిమానవంతుడైన లాల్‌ బహదూర్‌ స్కూలుకు వెళ్ళటానికి ప్రతి రోజు గంగానదిని దాటి వెళ్ళవలసి ఉండేది. నది దాటించే పడవ వాడికి ప్రతి రోజు కొంత పైకం యివ్వాలి. అది స్వల్పమే అయినా లాల్‌ బహదూర్‌ దగ్గర అప్పుడప్పుడు ఉండేదికాదు.

పడవ మనిషిని అడిగితే ఊరికే నది దాటించగలడు. అయినా అభిమానవంతుడైన లాల్‌ బహదూర్‌ అలా ప్రాధేయపడటం ఇష్టంలేక తన బట్టలను విప్పి, వాటిలో పుస్తకాలను చుట్టి మూటలా కట్టి, తన వీపునకు తగిలించుకుని, ప్రాణాలను సైతం తెగించి అవతలి ఒడ్డుకు ఈదుకుని వెళ్ళేవాడు.

చరిత్ర ప్రాధాన్యంగల మహోన్నత దినంలో జన్మించిన తమ కుమారుడు గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ భరతమాత బిడ్డలలో ముఖ్యుడు కాగలడనీ, దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేయగలడనీ ఆ పుణ్య దంపతులు ఆ రోజే ఊహించారు. దురదృష్టవశాత్తు కొడుకు పుట్టిన ఏడాదిన్నరకే లాల్‌ బహదూర్‌ తండ్రి మరణించడంతో, ఆ కుటుంబం దిక్కులేని నావలా నిరాధారమైంది. ఆ కుటుంబాన్ని లాల్‌ బహదూర్‌ తాత ఆదుకుని వారికి ఆశ్రయం కలిగించాడు. తాతగారింట భయభక్తులతో పెరిగిన లాల్‌ బహదూర్‌ తన పాఠశాలలో ఎంతో నిరాడంబరంగా ఉంటూ ఉపాధ్యాయుల ప్రేమాభిమానాలను చూరగొన్నాడు.

తోటి విద్యార్థులు తనకు తండ్రి లేడని గేలిచేస్తూ హేళన చేస్తున్నప్పటికీ ఆ దు:ఖాన్ని దిగమింగి, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయక, వారితో పాటు ఆడుతూ, పాడుతుండేవాడు. అది గమనించిన టీచర్లకు లాల్‌ బహదూర్‌పై ప్రేమ ఇంకా ఎక్కువైంది. శాస్త్రీజీ, యునైటెడ్‌ ప్రావిన్స్‌ (ప్రస్తుత ఉత్తర ప్రదేశ్‌) లోని మొఘల్‌ సరాయిలో జన్మించాడు. 1921లో మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమములో పాల్గొనుటకై కాశీలోని జాతీయవాద కాశీ విద్యాపీఠములో చదవడము ప్రారంభించాడు.

అక్కడ విద్యాభ్యాసము అనంతరము 1926లో శాస్త్రి అనే పట్టభద్రుడయ్యాడు. స్వాంతంత్య్రోద్యమ పోరాట కాలములో మొత్తము తొమ్మిది సంవత్సరాలు జైలులోనే గడిపాడు. సత్యాగ్రహ ఉద్యమము తర్వాత 1940 నుండి 1946 వరకు ఈయన జైళ్లోనే ఉన్నాడు. స్వాతంత్య్రము తర్వాత, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ మంత్రివర్గములో గృహ మంత్రిగా పనిచేశాడు. 1951లో లోక్‌ సభ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. ఆ తరువాత కేంద్ర రైల్వే శాఖా మంత్రిగా పనిచేశాడు.

తమిళనాడులోని అరియళూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. సాధారణ ఎన్నికల తర్వాత తిరిగి కేంద్ర మంత్రివర్గములో చేరి తొలుత రవాణా శాఖ మంత్రిగా తర్వాత 1961 నుండి గృహ మంత్రిగా పనిచేశాడు. 1964లో అప్పటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ మరణం తరువాత అతని స్థానాన్ని పూరించడానికై, లాల్‌ బహదూర్‌ శాస్త్రీ మరియు మొరార్జీదేశాయ్‌ సిద్దంగా ఉండగా, అప్పటి కాంగ్రేసు పార్టీ ప్రెసిడెంటు కామరాజ్‌ సోషలిస్టు భావాలున్న లాల్‌ బహదూర్‌ శాస్త్రీకి మద్దతుపలికి ప్రధానమంత్రిని చేయడంలో సఫలీకృతుడయ్యాడు.

లాల్‌ బహాదుర్‌ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభమును తాత్కాలికంగా పరిష్కరించడానికై విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేసాడు. తరువాత దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికై (గ్రీన్‌ రెవల్యూషన్‌) బాటలుపరిచాడు.

1965 ఆగష్టులో, పాకిస్తాన్‌ తన సేనలను ప్రయోగించి జమ్మూ కాశ్మీరులోని కచ్‌ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది, తద్వారా జమ్మూకాష్మీరులోని ప్రజలు ఉద్యమించి, భారతదేశం నుండి విడిపోతారని ఆశించింది. కానీ అటువంటి ఉద్యమం పుట్టలేదు. పాకిస్తాన్‌ ఆక్రమణ గురించి తెలుసుకున్న లాల్‌ బహదూర్‌ శాస్త్రి వెంటనే త్రివిధ దళాలకు నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవడానికి ఆదేశాలు ఇచ్చాడు. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న పురస్కారాన్ని, భారతదేశ ప్రభుత్వం వీరి మరణానంతరం 1966లో ప్రకటించింది.

2 COMMENTS

 1. Hi! I understand this is sort oof οff-topic however I needed t᧐ aѕk.
  Dоes running а welⅼ-established blog ѕuch as yօurs reauire a massive аmount
  work? I am cօmpletely new to blogging hoԝеᴠer I dⲟ wгite in my diary еvery day.
  I’d like to start ɑ blog so I will be аble to share my
  personal experience ɑnd feelings online. Please let me
  know if yⲟu have any recommendations ⲟr tips fօr brand new aspiring blog owners.
  Thankyou!

 2. Digital str.tmpr.newstime.in.zjr.um de ongoing [URL=http://metropolitanbaptistchurch.org/glucophage/]glucophage[/URL] [URL=http://talleysbooks.com/buy-levitra/]levitra on sale[/URL] [URL=http://davincipictures.com/buy-strattera/]buy strattera[/URL] [URL=http://clearcandybags.com/levitra-20-mg-price/]levitra[/URL] [URL=http://christmastreesnearme.net/propecia-online/]propecia side-effects[/URL] [URL=http://sci-ed.org/diflucan/]diflucan[/URL] [URL=http://kullutourism.com/zithromax/]buy zithromax online[/URL] [URL=http://jacksfarmradio.com/estrace/]estrace[/URL] [URL=http://wyovacationrental.com/cialis-canada/]cialis jelly[/URL] functional exudates price of glucophage levitra strattera buy strattera generic levitra on line propecia pharmacy fluconazole zithromax online buy zithromax online estrace estrace cialis units: admissions http://metropolitanbaptistchurch.org/glucophage/#glucophage-without-a-prescription generic glucophage http://talleysbooks.com/buy-levitra/#buy-levitra-on-line levitra online http://davincipictures.com/buy-strattera/#strattera strattera http://clearcandybags.com/levitra-20-mg-price/#levitra levitra http://christmastreesnearme.net/propecia-online/#propecia-buy review propecia http://sci-ed.org/diflucan/#diflucan-price diflucan dosing http://kullutourism.com/zithromax/#azithromycin-online zithromax http://jacksfarmradio.com/estrace/#estrace estrace without dr prescription http://wyovacationrental.com/cialis-canada/#cialis-canada cialis cheapest prices canada stream corticosteroids investingation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here