మోహన్‌ దాస్‌ కరంచంద్‌ గాంధీ భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవిస్తారు. సత్యం, అహింసలు గాంధీ కొలిచిన దేవతలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఆయన పూజాసామాగ్రి. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికంగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను సీఎన్‌ఎస్‌ జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యం కావాలని బోధించాడు.

మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ”ఇటువంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు… మన తరంలో రాజకీయవేత్తలందరికంటే కూడా గాంధీ ఆభిప్రాయాలు మేలైనవి. ఆయన చెప్పినట్లుగా మనం నడచుకోవాలి. మనకు కావలసినదాని కోసం హింసతో పోట్లాడటము కాదు. ఆన్యాయమని మనకు తోచినదానికి ఏ మాత్రమూ సాయము చేయకుండా ఉండటము మన బాధ్యత” అని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ అన్నారు.

”జీసస్‌ నాకు సందేశం ఇచ్చాడు, గాంధీ దాన్ని ఆచరణలో చూపించాడు” అని మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ కొనియాడారు. ‘మోహన్‌ దాస్‌ కరంచంద్‌ గాంధీ’ 1869 అక్టోబర్‌ 2వ తేదీన (శుక్ల నామ సంవత్సరం భాద్రపద బహుళ ద్వాదశి శనివారం) గుజరాత్‌ రాష్ట్రంలోని పోర్‌ బందర్లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు కరంచంద్‌ గాంధీ. తల్లి పుతలీ బాయి. వారిది ఆచారాలు బాగా పాటించే సభ్య కుటుంబం. మోహన్‌ దాస్‌ కరంచంద్‌ గాంధీ కాస్త నిధానంగా ఉండే బాలుడు. చిన్నతనం నుండీ అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరంగా ఉండే ప్రయత్నం చేశాడు.

13 ఏళ్ల వయసులో అప్పటి ఆచారము ప్రకారం కస్తూర్బాయితో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు (హరిలాల్‌ గాంధీ, మణిలాల్‌ గాంధీ, రామదాస్‌ గాంధీ, దేవదాస్‌ గాంధీ) చదువులో గాంధీ మధ్యస్థమైన విద్యార్ధి. పోర్‌ బందర్లోను, రాజ్‌కోట్లోను ఆయన చదువు కొనసాగింది. 19 సంవత్సరాల వయసులో (1888లో) న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండు వెళ్ళాడు. తల్లికిచ్చిన మాట ప్రకారం ఆయన మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు. ఆయనకు బెర్నార్డ్‌ షా వంటి ఫేబియన్లతో పరిచయం ఏర్పడింది. అనేక మతాల పవిత్ర గ్రంధాలను చదివాడు.

ఈ కాలములోనే ఆయన చదువూ, వ్యక్తిత్వమూ, ఆలోచనా సరళీ రూపు దిద్దుకొన్నాయి. 1891లో ఆయన పట్టభద్రుడై భారతదేశానికి తిరిగివచ్చాడు. బొంబాయిలోను, రాజ్‌కోట్లోను ఆయన చేపట్టిన న్యాయవాద వృత్తి అంతగా రాణించలేదు. 1893లో దక్షిణాఫ్రికాలోని నాటల్‌లో ఒక లా కంపెనీలో సంవత్సరము కాంట్రాక్టు లభించింది. ఒక సంవత్సరం పనిమీద వెళ్ళిన గాంధీ, దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు (1893 నుండి 1914 వరకు) గడిపాడు. కేవలం తెల్లవాడు కానందువల్ల రైలు బండి మొదటి తరగతి లోంచి నెట్టివేయడం, హోటళ్ళలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు ఆయనకు సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి. వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి, ఎదుర్కొని పోరాడే పటిమను ఆయన నిదానంగా పెంచుకొన్నాడు.

గాంధీ నాయకత్వ పటిమ వృద్ధి చెందడానికీ, ఆయన ఆలోచనా సరళి పరిపక్వము కావడానికీ, రాజకీయ విధివిధానాలు రూపు దిద్దుకోవడానికీ ఇది చాలా ముఖ్యమైన సమయము. ఒక విధముగా భారతదేశంలో నాయకత్వానికి ఇక్కడే బీజాలు మొలకెత్తాయి.భారతీయుల అభిప్రాయాలను కూడగట్టటమూ, అన్యాయాల పట్ల వారిని జాగరూకులను చేయడమూ ఆయన చేసిన మొదటి పని. 1894లో భారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. బిల్లు ఆగలేదుగానీ, ఆయన బాగా జనాదరణ సంపాదించాడు. ఇండియన్‌ ఒపీనియన్‌ అనే పత్రికను ఆయన ప్రచురించాడు. సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే ఆయన అమలు చేశాడు.

ఇది ఆయనకు కేవలం పని సాధించుకొనే ఆయుధం కాదు. నిజాయితీ, అహింస, సౌభ్రాతృత్వము అనే సుగుణాలతో కూడిన జీవితం గడపడంలో ఇద ఒక పరిపూర్ణ భాగము. గనులలోని భారతీయ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి ఆయన మొదలుపెట్టిన సత్యాగ్రహము 7 సంవత్సరాలు సాగింది. 1913 లో వేలాది కార్మికులు చెరసాలలకు వెళ్ళారు. కష్టనష్టాలకు తట్టుకొని నిలచారు. చివరకు దక్షిణాఫ్రికా ప్రభుత్వము కొన్ని ముఖ్యమైన సంస్కరణలు చేపట్టింది.కానీ గాంధీకి బ్రిటిష్‌ వారిపై ద్వేషం లేదు. వారి న్యాయమైన విధానాలను ఆయన సమర్ధించాడు.

బోయర్‌ యుద్ధకాలంలో (1899-1902)ఆయన తన పోరాటాన్ని ఆపి, వైద్యసేవా కార్యక్రమాలలో నిమగ్నుడైనాడు. ప్రభుత్వము ఆయన సేవలను గుర్తించి, పతకంతో సత్కరించింది. ఈ కాలంలో అనేక గ్రంధాలు చదవడం వలన, సమాజాన్ని అధ్యయనం చేయడం వలన ఆయన తత్వము ఎంతో పరిణతి చెందింది. లియో టాల్‌స్టాయ్‌ రాసిన గ్రంధాలు ఆయనను బాగా ప్రభావితం చేశాయి. కాని, అన్నిటికంటే ఆయన ఆలోచనపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంధము భగవద్గీత. గీతా పఠనం వల్ల ఆయనకు ఆత్మజ్ఞానము యొక్క ప్రాముఖ్యతా, నిష్కామ కర్మ విధానమూ వంటబట్టాయి.

అన్ని మతాలూ దాదాపు ఒకే విషయాన్ని బోధిస్తున్నాయని కూడా ఆయన గ్రహించాడు. దక్షిణాఫ్రికాలో ఫీనిక్స్‌ ఫార్మ్‌, టాల్‌ స్టాయ్‌ ఫార్మ్లలో ఆయన సామాజిక జీవనాన్నీ, సౌభ్రాత్వత్వాన్నీ ప్రయోగాత్మకంగా అమలు చేశాడు. ఇక్కడ వ్యక్తులు స్వచ్ఛందంగా సీదా సాదా జీవితం గడిపేవారు – కోరికలకు కళ్ళెం వేయడమూ, ఉన్నదేదో నలుగురూ పంచుకోవడమూ, ప్రతి ఒక్కరూ శ్రమించడమూ, సేవా దృక్పథమూ, ఆధ్యాత్మిక దృక్కోణమూ ఈ జీవితంలో ప్రధానాంశాలు. గాంధీ స్వయంగా పంతులుగా, వంటవాడిగా, పాకీవాడిగా ఈ సహజీవన విధానంలో పాలు పంచుకొన్నాడు. ఈ సమయంలోనే ఆయన అస్పృశ్యతకూ, కులవివక్షతకూ, మతవిద్వేషాలకూ ఎదురు నిలవడం బోధించాడు.

క్లుప్తంగా చెప్పాలంటే సంపూర్ణమైన జీవితం గడపడం ఆయన మార్గము. పోరాటాలూ, సంస్కరణలూ ఆ జీవితంలో ఒక భాగము. ఒక అన్యాయాన్ని వ్యతిరేకించి, మరొక అన్యాయాన్ని సహించడం ఆయన దృష్టిలో నేరము. 1914లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారతదేశంలో స్వాతంత్య్రోద్యమం అప్పుడే చిగురు వేస్తున్నది. భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో గాంధీ పాల్గొనసాగాడు. అప్పటి ప్రధాన నేతలలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాలు, సమస్యలను పరిచయం చేశాడు.

చాలామంది నాయకులకు ఇష్టం లేకున్నా గాంధీ మొదటి ప్రపంచ యుద్ధములో బ్రిటిష్‌ వారిని సమర్ధించి, సైన్యంలో చేరడాన్ని ప్రోత్సహించాడు. బ్రిటిష్‌ సామ్రాజ్యంలో స్వేచ్ఛనూ, హక్కులనూ కోరుకొనేవారికి ఆ సామ్రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నదని ఆయన వాదం. బీహార్లోని బాగా వెనుకబడిన చంపారణ్‌ జిల్లాలో తెల్లదొరలు, వారి కామందులూ ఆహార పంటలు వదలి, నీలిమందు వంటి వాణిజ్యపంటలు పండించమని రైతులను నిర్బంధించేవారు. పండిన పంటకు చాలీచాలని మూల్యాన్ని ముట్టచెప్పేవారు. పేదరికమూ, దురాచారాలూ, మురికివాడలూ అక్కడ ప్రబలి ఉన్నాయి.

ఆపైన అక్కడ తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సర్కారువారు పన్నులు పెంచారు. గుజరాత్లోని ఖేడా లోనూ ఇదే పరిస్థితి. గాంధీ ఆ పరిస్థితులను వివరంగా అధ్యయనం చేయించి, 1918లలో చంపారణ్‌, ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడమూ, చదువునూ సంస్కారాన్నీ పెంచడమూ, జాతి వివక్షతను విడనాడడమూ, అన్యాయాన్ని ఖండించడమూ ఈ సత్యాగ్రహంలో భాగము. ఈ కార్యక్రమంలో ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ గాంధీకి కుడిభుజంగా నిలచాడు. ఆయన నాయకత్వంలో వేలాదిగా ప్రజలు సర్కారు దౌర్జన్యాలకు ఎదురు నిలచి, జైలుకు తరలి వెళ్ళారు.

సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారన్న నేరంపై ఆయనను అరెస్టు చేసినపుడు జనంలో పెద్ద యెత్తున నిరసన పెల్లుబికింది. చివరకు వత్తిడికి తలొగ్గి సరైన కొనుగోలు ధరలు చెల్లించడానికీ, పన్నులు తగ్గించడానికీ ఒప్పందాలు కుదిరాయి. ఖైదీలు విడుదలయ్యారు. ఈ కాలంలోనే గాంధీగారిని ప్రజలు ప్రేమతో బాపు అనీ, మహాత్ముడు అనీ పిలుచుకొనసాగారు. గాంధీగారి నాయకత్వానికి బహుముఖంగా ప్రశంసలూ, ఆమోదమూ లభించాయి.1919లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నేరమనే రౌలట్‌ చట్టానికి నిరసన పెల్లుబికినపుడు గాంధీ నడిపిన సత్యాగ్రహము ఆ చట్టాలకు అడ్డు కట్ట వేసింది.

కాని ప్రజలలో ఆగ్రహం పెరిగి ఎదురుదాడులు మొదలైనప్పుడు ఆయన బాగా తీవ్రస్థాయిలో ఉన్న ఉద్యమాన్ని ఆపు చేసి, పరిహారంగా నిరాహారదీక్ష సలిపాడు. పట్టుబట్టి ఆ దాడులో మరణించిన బ్రిటిష్‌ ప్రజలపట్ల సంతాప తీర్మానాన్ని ఆమోదింపజేశాడు. హింసకు ప్రతిహింస అనేది గాంధీ దృష్టిలో దుర్మార్గము. ఏ విధమైన హింసయినా తప్పే. ఏప్రిల్‌ 13, 1919న అమృత్‌ సర్‌, పంజాబులోని జలియన్‌ వాలా బాగ్లో సామాన్య జనులపై జరిగిన దారుణ మారణకాండలో 400 మంది నిరాయుధులైన భారతీయులు మరణించారు. ఫలితంగా సత్యాగ్రహము, అహింస అనే పోరాట విధానాలపై మిగిలినవారికి కాస్త నమ్మకం సడలగా, అవే సరైన మార్గాలని గాంధీకి మరింత దృఢంగా విశ్వాసం కుదిరింది.

అంతే కాదు, భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలనే సంకల్పం గాంధీలోనూ, సర్వత్రానూ ప్రబలమైంది. 1921లో భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీకి ఆయన తిరుగులేని నాయకునిగా గుర్తింపబడ్డాడు. కాంగ్రెసును పునర్వ్యవస్థీకరించి, తమ ధ్యేయం స్వరాజ్యము అని ప్రకటించాడు. వారి భావంలో స్వరాజ్యము అంటే పాలన మారటం కాదు. వ్యక్తికీ, మనసుకీ, ప్రభుత్వానికీ స్వరాజ్యము కావాలి. తరువాతి కాలంలో గాంధీ తమ పోరాటంలో మూడు ముఖ్యమైన అంశాలను జోడించాడు. స్వదేశీ… విదేశీ వస్తువులను బహిష్కరించడం, నూలు వడకడం, ఖద్దరు ధరించడం, విదేశీ విద్యనూ, బ్రిటిష్‌ సత్కారాలనూ తిరస్కరించడం. వీటివల్ల ఉద్యమంలో క్రమశిక్షణ పెరిగింది.

మహిళలు మరింతగా ఉద్యమానికి దగ్గరయ్యారు. దేశ ఆర్ధిక వ్వవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలకు అవకాశం పెరిగింది. ఆత్మాభిమానమూ, ఆత్మ విశ్వాసమూ వెల్లి విరిశాయి. శ్రమకు గౌరవాన్ని ఆపాదించడం ఆన్నింటికంటే ముఖ్యమైన ఫలితం. సహాయ నిరాకరణ… ఏదయితే అన్యాయమో దానికి ఏ మాత్రమూ సహకరించకపోవడం. ప్రభుత్వానికి పాలించే హక్కు లేనందున దానికి పన్నులు కట్టరాదు. వారి చట్టాలను ఆమోదించరాదు. ఈ ఉద్యమానికి మంచి స్పందన లభించింది. కాని 1922లో ఉత్తరప్రదేశ్‌ చౌరీచౌరాలో ఉద్రేకాలు పెల్లుబికి హింస చెలరేగింది. ఉద్యమం అదుపు తప్పుతున్నదని గ్రహించి, గాంధీ దాన్ని వెంటనే నిలిపివేశాడు. సమాజ దురాచార నిర్మూలన – గాంధీ దృష్టిలో స్వాతంత్య్రము అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశం. అంటరానితనమున్నచోట, మురికివాడలున్నచోట, హిందూ ముస్లిములు తగవులాడుకొంటున్నచోట స్వాతంత్య్ర మున్నదనుకోవడంలో అర్ధం లేదు.

గాంధీ ప్రవేశపెట్టిన ఈ ఆలోచనా సరళి వల్లనే భారతీయులు గర్వింపదగిన ఆధునిక భావాలూ, విలువలూ ఈరోజు సాధారణ జీవన సూత్రాలుగా పాదుకొన్నాయని మనం గ్రహించాలి. 1922లో రెండు సంవత్సరాలు జైలులో గడిపాడు. ఈ కాలంలో కాంగ్రెసులో అతివాద, మితవాద వర్గాల మధ్య భేదాలు బలపడ్డాయి. హిందూ ముస్లిం వైషమ్యాలు కూడా తీవ్రం కాసాగాయి. తరువాత ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆయన ప్రయత్నం చేశాడు. 1924లో మూడు వారాల నిరాహారదీక్ష సాగించాడు. కాని వాటి ఫలితాలు కొంతవరకే లభించాయి. మద్యపానము, అంటరానితనం, నిరక్షరాస్యతలను నిర్మూలించే ఉద్యమాలలో ఆయన లీనమయ్యారు. 1927లో సైమన్‌ కమిషన్కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తరువాత మరలా గాంధీ స్వరాజ్యోద్యమంలో చురుకైన పాత్రను చేబట్టాడు.

అందరికీ సర్ది చెప్పి, 1928లో కలకత్తా కాంగ్రెసులో స్వతంత్ర ప్రతిపత్తి తీర్మానాన్ని ఆమోదింపజేశారు.అందుకు బ్రిటిష్‌ వారికి ఒక సంవత్సరం గడువు ఇచ్చాడు. ఆయినా ఫలితం శూన్యం. 1929 డిసెంబర్‌ 31న లాహోర్లో భారత స్వతంత్ర పతాకం ఎగురవేయబడింది. 1930 జనవరి 26ను స్వాతంత్య్ర దినంగా ప్రకటించాడు. ఆ రోజున ఉద్యమం చివరి పోరాటం మొదలైందని చెప్పవచ్చును. ఉప్పు సత్యాగ్రహం (దండియాత్ర), క్విట్‌ ఇండియా ఉద్యమం స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టాలు. ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ 1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు. ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించి, పన్ను కట్టకుండా, సముద్రంలోంచి ఉప్పును తీసుకోవడమనే చిన్న సూత్రంపై ఇది ఆధారపడింది. మార్చి 21 నుండి ఏప్రిల్‌ 6 వరకు అహమ్మదాబాదు నుండి దండి వరకు 400 కి.మీ. పాదయాత్ర ఈ పోరాటంలో కలికితురాయి.

దారిపొడవునా అభినందించేవారు, సన్మానించేవారు, పూజించేవారు – ఇది తరతరాలు తెలుసుకోవలసిన పెద్ద పండుగ. దారిలో చేరినవారితో దండి చేరుకొనే సరికి జనం వెల్లువలా పోటెత్తారు. దండిలోనే కాదు, దేశంలో ఊరూరా ఉప్పు సత్యాగ్రహ సంఘాలు ఏర్పడ్డాయి. మొత్తం దేశంలో 60,000 మంది చెరసాల పాలయ్యారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. 1931లో గాంధీ-ఇర్విన్‌ ఒడంబడిక ప్రకారం ఉద్యమం ఆపారు. అందరినీ విడుదల చేశారు. 1932లో లండన్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు భారత జాతీయ కాంగ్రెసు ఏకైక ప్రతినిధిగా గాంధీ హాజరయ్యాడు. కాని ఆ సమావేశం గాంధీని, స్వాతంత్య్రవాదులందరినీ నిరాశపరచింది. లార్డ్‌ ఇర్విన్‌ తరువాత వచ్చిన లార్డ్‌ విల్లింగ్డన్‌ మరలా స్వాతంత్య్రోద్యమాన్ని పూర్తిగా అణచి వేయడానికి ప్రయత్నించాడు. 1932లో నిమ్న కులాలవారినీ, ముస్లిములనూ వేరుచేయడానికి ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టారు.ఇందుకు వ్యతిరేకంగా 6 రోజులు నిరాహార దీక్ష చేసి గాంధీ సమదృష్టితో పరిష్కారాన్ని తెచ్చేలా వత్తిడి చేశారు.

తరువాత అంటరానివారిగా చూడబడిన వర్గాలపట్ల సమాజ దృక్పథాన్నీ, వారి స్థితిగతులనూ మెరుగుపరచడానికి గాంధీ తీవ్రంగా కృషి చేశాడు. వారిని హరిజనులని పిలిచాడు. ఆత్మశోధనకూ, ఉద్యమస్ఫూర్తికీ 1933 మే 8 నుండి 21 రోజుల నిరాహారదీక్ష సాగించాడు. 1934లో ఆయనపై మూడు హత్యాప్రయత్నాలు జరిగాయి. ఫెడరేషన్‌ పద్ధతిలో ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెసు సిద్ధమైనపుడు గాంధీ కాంగ్రెసుకు రాజీనామా చేశాడు. తన నాయకత్వంవల్ల కాంగ్రెసులోని వివిధ వర్గాల నాయకుల రాజకీయనాయకుల స్వేచ్ఛా ప్రచారానికి ఇబ్బంది రాకూడదనీ, స్వాతంత్య్రమనే ప్ధాన లక్ష్యాన్నుంచి దృష్టి మరలకూడదనీ ఆయన ఉద్దేశము. 1936లో లక్నో కాంగ్రెసు సమావేశం నాటికి మరలా గాంధీ ప్రధానపాత్ర తీసుకొన్నాడు. 1938లో కాంగ్రెసు అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాస్‌ చంద్రబోసుతో గాంధీకి తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. బోసుకు ప్రజాస్వామ్యంపైనా, అహింసపైనా పూర్తి విశ్వాసం లేదన్నది గాంధీగారి ముఖ్యమైన అభ్యంతరం. అయినా బోసు మళ్ళీ రెండోసారి కాంగ్రెసు ప్రెసిడెంటుగా ఎన్నికయ్యాడు.

తరువాత సంభవించిన తీవ్రసంక్షోభం కారణంగా బోసు కాంగ్రెసుకు దూరమయ్యారు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. ప్రజా ప్రతినిధులను సంప్రదించకుండా భారతదేశాన్ని యుద్ధంలో ఇరికించారనీ, ఒకరి స్వాతంత్య్రాన్ని కాలరాస్తూ మరొకప్రక్క స్వేచ్ఛకోసం యుద్ధమని చెబుతున్నారనీ బ్రిటిష్‌ విధానాన్ని కాంగ్రెసు వ్యతిరేకించింది. పార్లమెంటు నుండి కాంగ్రెసు వారంతా రాజీనామా చేశారు. బ్రిటిష్‌ వారు భారతదేశాన్ని వదలిపోవాలని డిమాండ్‌ చేస్తూ 1942 లో క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. క్విట్‌ ఇండియా ఉద్యమం బాగా తీవ్రంగా సాగింది.

ఊరేగింపులూ, అరెస్టులూ, హింసా పెద్ద ఎత్తున కొనసాగాయి. కాంగ్రెసులో అంతర్గతంగా కూడా బలమైన విభేదాలు పొడచూపసాగాయి. ఈ సమయంలో గాంధీ చిన్నచిన్న హింసాత్మక ఘటనలున్నా ఉద్యమం ఆగదని దృఢంగా స్పష్టం చేశాడు. భారత్‌ ఛోడో – భారతదేశాన్ని వదలండి – అన్నది నినాదము. కరో యా మరో – చేస్తాం, లేదా చస్తాం – అన్నది అప్పటి నిశ్చయము. ప్రభుత్వము కూడా తీవ్రమైన అణచివేత విధానాన్ని చేపట్టింది. 1942 ఆగష్టు 9న గాంధీతో బాటు పూర్తి కాంగ్రెసు కార్యవర్గం అరెస్టయ్యింది. గాంధీ రెండేళ్ళు పూణే జైలులో గడిపాడు. ఈ సమయంలోనే ఆయన సెక్రటరీ మాధవ దేశాయ్‌ మరణించాడు. ఆయన సహధర్మచారిణి కస్తూరిబాయి 18 నెలల కారాగారవాసం తరువాత మరణించింది. గాంధీ ఆరోగ్యం బాగా క్షీణించింది. అనారోగ్య కారణాలవల్ల ఆయనను 1944లో విడుదల చేశారు.

యుద్ధము తరువాత ఇతర నాయకులనూ, లక్షపైగా ఉద్యమకారులనూ విడుదల చేశారు. క్రమంగా స్వాతంత్య్రం ఇవ్వబడుతుందని అంగీకరించారు. 1946లో స్పష్టమైన బ్రిటిష్‌ కాబినెట్‌ మిషన్‌ ప్రతిపాదన చర్చకు వచ్చింది. కాని ఈ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితిలోను అంగీకరించవద్దని గాంధీజీ పట్టుపట్టాడు. ముస్లిమ్‌ మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలనే ఆలోచన దేశవిభజనకు నాంది అని గాంధీజీ భయము. గాంధీజీ మాటను కాంగ్రెసు త్రోసిపుచ్చిన కొద్ది ఘటనలలో ఇది ఒకటి. కాబినెట్‌ మిషన్‌ ప్రతిపాదనను నిరాకరిస్తే అధికారం క్రమంగా ముస్లిమ్‌ లీగ్‌ చేతుల్లోకి జారుతుందని నెహ్రూ, సర్దార్‌ పటేల్‌ అభిప్రాయపడ్డాడు. 1946-47 సమయంలో 5000 మంది హింసకు ఆహుతి అయ్యారు.

హిందువులు, ముస్లిములు, సిక్కులు, క్రైస్తవులు ఇరుగు పొరుగులుగా ఉన్న దేశాన్ని మతప్రాతిపదికన విభజింపడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు. అలాంటి ఆలోచన ససామాజికంగానూ, నైతికంగానూ,ఆధ్యాత్మికంగానూ కూడా గాంధీ తత్వానికి పెనుదెబ్బ. కాని ముస్లిమ్‌ లీగ్‌ నాయకులైన ముహమ్మద్‌ ఆలీ జిన్నా కి పశ్చిమ పంజాబు, సింధ్‌, బలూచిస్తాన్‌, తూర్పు బెంగాల్‌ లో మంచి ప్రజాదరణ ఉన్నది. కావాలంటే జిన్నాను ప్రధానమంత్రిగా చేసైనా దేశాన్ని ఐక్యంగా నిలపాలని ఆయన ప్రగాఢ వాంఛ. కాని జిన్నా – దేశ విభజనో, అంతర్గత యుద్ధమో తేల్చుకోండి – అని హెచ్చరించాడు. చివరకు హిందూ – ముస్లిం కలహాలు ఆపాలంటే దేశవిభజనకంటే గత్యంతరము లేదని తక్కిన కాంగ్రెసు నాయకత్వము అంగీకరించింది. అయితే గాంధీ పట్ల ప్రజలకూ పార్టీ సభ్యులకూ ఉన్న ఆదరణ దృష్ట్యా గాంధీ సమ్మతించకపోతే ఏ నిర్ణయమూ తీసుకొనే అవకాశం లేదు.

అంతర్గత యుద్ధాన్ని ఆపడానికి వేరే మార్గం లేదని గాంధీని ఒప్పించడానికి పటేల్‌ శతవిధాల ప్రయత్నించాడు. చివరకు హతాశులైన గాంధీ ఒప్పుకొనక తప్పలేదు. కాని ఆయన పూర్తిగా కృంగిపోయారు. 1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు జరుపుకొంటూ ఉండగా దేశవిభజన వల్ల విషణ్ణులైన గాంధీమాత్రము కలకత్తాలో ఒక హరిజనవాడను శుభ్రముచేస్తూ గడిపాడు. ఆయన కలలన్నీ కూలిపోయిన సమయంలో హిందూ ముస్లిమ్‌ మత విద్వేషాలు పెచ్చరిల్లి ఆయనను మరింత శోకానికి గురిచేశాయి. స్వాతంత్య్రానంతరం గాంధీగారి ప్రయత్నాలు హిందూ-ముస్లిం విద్వేషాలను నివారించడానికీ, ఆత్మశోధనకూ పరిమితమయ్యాయి. ప్రభుత్వం పరిస్థితిని అదుపు చేయలేని అసహాయ స్థితిలో పడింది. మొత్తం పోలీసు బలగాలు దేశ పశ్చిమప్రాంతానికి పంపబడ్డాయి.

తూర్పు ప్రాంతంలో కల్లోలాలను అదుపు చేసే భారం గాంధీ గారిపై పడింది. దేశవిభజనతో ముఖ్యంగా పంజాబు, బెంగాలులో పెద్దఎత్తున సంభవించిన వలసలవల్ల మత కలహాలు, మారణకాండలు ప్రజ్వరిల్లాయి. 1947లో కాశ్మీరు విషయమై భారత్‌ – పాకిస్తాన్‌ యుద్ధం తరువాత ఇంటా, బయటా పరిస్థితి మరింత క్షీణించింది. ముస్లిములందరినీ పాకిస్తాను పంపాలనీ, కలసి బ్రతకడం అసాధ్యమనీ వాదనలు నాయకుల స్థాయిలోనే వినిపించసాగాయి. ఈ పరిస్థితి గాంధీకి పిడుగుదెబ్బ వంటిది.

దీనికి తోడు విభజన ఒప్పందం ప్రకారము పాకిస్తానుకు ఇవ్వవలసిని 55 కోట్లు రూపాయలను ఇవ్వడానికి భారత్‌ నిరాకరించింది. ఆ డబ్బు భారతదేశంపై యుద్ధానికి వాడబడుతుందని పటేల్‌ వంటి నాయకుల అబిప్రాయం. కాని అలా కాకుంటే పాకిస్తాన్‌ మరింత ఆందోళన చెందుతుందనీ, దేశాలమధ్య విరోధాలు ప్రబలి మతవిద్వేషాలు సరిహద్దులు దాటుతాయనీ, అంతర్యుద్దానికి దారితీస్తుందనీ గాంధీగారి అభిప్రాయం.ఈ విషయమై ఆయన ఢిల్లీలో తన చివరి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు.

ఆయన డిమాండ్లు రెండు – (1) మత హింస ఆగాలి (2) పాకిస్తానుకు 55 కోట్ల రూపాయలు ఇవ్వాలి. – ఎవరెంతగా ప్రాధేయపడినా ఆయన తన దీక్ష మానలేదు. చివరకు ప్రభుత్వం దిగివచ్చి పాకిస్తానుకు డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది. హిందూ, ముస్లిమ్‌, సిక్కు వర్గాల నాయకులు సఖ్యంగా ఉండటానికి కట్టుబడి ఉన్నామని ఆయనవద్ద ప్రమాణం చేశాడు. అప్పుడే ఆయన నిరాహార దీక్ష విరమించారు.కాని ఈ మొత్తం వ్యవహారంలో గాంధీగారి పట్ల మతోన్మాదుల ద్వేషం బలపడింది. ఆయన పాకిస్తానుకూ, ముస్లిములకూ వత్తాసు పలుకుతున్నారని హిందూమతంలోని తీవ్రవాదులూ, హిందువులకోసం ముస్లిము జాతీయతను బలిపెడుతున్నాడని ముస్లిములలోని తీవ్రవాదులూ ఉడికిపోయారు.

1948 జనవరి 30న గాడ్సే వారి బృందం గాంధీని హత్యచేయటానికి విఫల ప్రయత్నం ఛేసారు. అందులో వారి అనుచరుడు మదన్‌ లాల్‌ అరెస్టయినాడు.ఈ విషయం గాంధీకి తెలిసిన మీదట, మదన్‌ లాల్‌ ను ధైర్యం గల కుర్రాడని మెచ్చుకున్నాడట. ఆయన మాటల్లొనే ఆయన ప్రతిస్పందన- పిల్లలు!! వీళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. నేను పోయాక గుర్తుకు తెచ్చుకుంటారు, ఆ ముసలాడు సరిగానే చెప్పాడని. 1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్ధనా సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూరామ్‌ గాడ్సే కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ హే రామ్‌ అన్నాడని చెబుతారు.

ఢిల్లీ రాజఘాట్లో అతని సమాధి, స్మారక స్థలమైన రాజ్‌ ఘాట్‌ వద్ద ఈ మంత్రమే చెక్కి ఉన్నది.మహాత్ముని మరణాన్ని ప్రకటిస్తూ జవహర్‌ లాల్‌ నెహ్రూ రేడియోలో అన్న మాటలు: మిత్రులారా, మన జీవితాల్లో వెలుగు అంతరించి, చీకటి అలుముకొన్నది. ఏమి చెప్పటానికీ నాకు మాటలు కరవయ్యాయి. మన జాతిపిత బాపూ ఎప్పటిలాగా మన కంటికి కన్పించడు. మనను ఓదార్చి, దారి చూపే పెద్దదిక్కు మనకు లేకుండా పోయాడు. నాకూ, కోట్లాది దేశప్రజలకూ ఇది తీరని శోకము… గాంధీని నిలదీయటానికి ఏటువంటి చట్టపరమయిన అవకాశం లేదు. అతనికి సహజ మరణం పొందే అవకాశం ఇవ్వకూడదు అని నాకు అనిపించింది. గాంధీని తనెలా చంపాడో-గాడ్సేమాటలు… పిస్టల్‌ నా కుడి అరచేతిలోఇముడ్చుకొని, రెండు చేతులూ ముకుళించి నమస్తే అన్నాను. నా ఎడమ చేతితో అడ్డంగా ఉన్న ఒక అమ్మాయిని పక్కకు తోసేసాను. ఆ తరువాత కాల్పులు జరిగాయి, తుపాకీ దానంతటే పేలిందనిపించింది.

నేను రెండు సార్లు కాల్చానా, మూడు సార్లు కాల్చానా అన్నది నాకెప్పటికీ తెలియని విషయం. గాంధీ గుండు దెబ్బ తగలగానే హెరామ్‌ అని కిందపడిపొయ్యాడు. నేను తుపాకీని పైకెత్తి గట్టిగాపట్టుకొని నిలుచుని పోలీస్‌! పోలీస్‌! అని అరవటం మొదలు పెట్టాను.నాకు కావలిసింది అందరూ, నేను ఈ పని ముందుగావేసుకొన్న పథకం ప్రకారం కావాలని చేసానని అనుకోవాలి, అంతేకాని, ఏదో క్షణికావేశంలో చేశాననుకోకూడదు. అక్కడనుంచి తప్పించుకుని పారిపోవటానికి పయత్నించానని గానీ, తుపాకీ వదిలించుకొవలని అనుకుంటున్నానని గాని అవరూ అనుకోకూడదు. తుపాకీతోసహా పట్టుబడతమే నా అభిమతం. కానీ దాదాపు ఒక అర నిమిషందాకా, ఎవరూ కదలలేదు.

నాథూరామ్‌ గాడ్సే హత్యా స్థలంనుండి పారిపొయ్యే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు, అతన్ని నిర్భంధించి తుగ్లక్‌ రోడ్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకొని వెళ్ళారు. అక్కడ డిఎస్పీ సర్దార్‌ జస్వంన్త్‌ సింగ్‌ మొదటి సమాచార నివేదిక తయారు చేసాడు. న్యాయ స్థానాలలో తగిన విచారణ అనంతరం నాథూరామ్‌ గాడ్సేను అతనికి హత్యలో సహకరించిన నారాయణ ఆప్టేలను 1949 నవంబరు 15న ఉరి తీసారు. అహింసా పద్ధతిలో దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన మహాత్మాగాంధీకి నోబెల్‌ శాంతి బహుమతి ఇచ్చి ఉండాల్సింది.

1937, 1947, 1948లో మూడుసార్లు గాంధీ నామినీగా ఎంపికయినా నోబెల్‌ కమిటీ ఏవో కుంటి సాకులు చెప్పి నోబెల్‌ బహుమతి అందకుండా చేసింది. ఈ అవార్డులు చాలా మంది ఐరోపాలోని తెల్ల జాతీయులకే అందించింది. నోబెల్‌ శాంతి బహుమతిని జిమ్మీ కార్టర్‌, హెన్రీ కిసింజర్‌, అల్‌గోర్‌, ఒబామాకు కూడా ఇచ్చారు. కానీ, సామాన్యుడి చేతికి సత్యాగ్రహమనే ఆయుధాన్ని అందించి, అహింసే పరమ ధర్మమని విశ్వసించి, మూర్తీభవించిన శాంతంగా పేరొందిన గాంధీకి మాత్రం నోబెల్‌ శాంతి బహుమతి రాలేదు. బాపూజీ 1948లో మరణించారు. అంతకంటే ముందు పదకొండేళ్లలో 3సార్లు ఆయన పేరు నోబెల్‌ శాంతి బహుమతి కోసం పరిశీలనకు వెళ్లింది. ప్రతిసారీ ఆయనను తిరస్కరించారు.

ఈ బహుమతి అందకపోవడానికి కారణాలుగా చెప్పబడిన విషయాల్లో ఈ క్రింది విషయాలు ముఖ్యమైనవి. ఆయన రాజకీయ నాయకుడు కాదు. అంతర్జాతీయ చట్టాల రూపకర్త కాదు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అంతర్జాతీయ శాంతి సంస్థలతో ఆయనకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆయన జాతీయవాదే కానీ అంతర్జాతీయ మానవతావాది కాదు. దక్షిణాఫ్రికాలో కూడా ఆయన భారతీయుల కోసమే పోరాడాడు కానీ అంతకంటే హీనంగా ఉన్న నల్లజాతీయులకోసం పోరాడలేదు. 1948లో అవార్డు ఇవ్వకముందే హత్యచేయబడ్డాడు. చనిపోయిన వారికి అవార్డు ఇవ్వకూడదని, బతికున్న వాళ్ళలో అర్హులెవరూలేరని ఆయేడాది అవార్డునే రద్దుచేశారు.

15 COMMENTS

 1. Hmm it appears like your website ate my first comment
  (it was extremely long) so I guess I’ll just sum it up what I submitted and say, I’m thoroughly enjoying your blog.
  I as well am an aspiring blog writer but I’m still new to everything.
  Do you have any points for rookie blog writers?
  I’d definitely appreciate it.

 2. Hello just wanted to give you a quick heads up. The
  text in your content seem to be running off the screen in Safari.
  I’m not sure if this is a formatting issue or something
  to do with browser compatibility but I figured I’d post to let you know.
  The layout look great though! Hope you get the issue solved soon.
  Cheers

 3. Great article! That is the kind of information that are meant to
  be shared across the internet. Shame on the search engines
  for now not positioning this post higher! Come on over and consult with my site
  . Thank you =)

 4. Hmm it appears like your website ate my first comment (it was extremely long) so I guess I’ll
  just sum it up what I had written and say, I’m thoroughly enjoying
  your blog. I too am an aspiring blog blogger but I’m still
  new to everything. Do you have any helpful hints for first-time blog writers?
  I’d definitely appreciate it.

 5. Magnificent beat ! I would like to apprentice while you amend your website, how could i subscribe for a blog web site?
  The account helped me a acceptable deal. I had been a little
  bit acquainted of this your broadcast offered bright clear idea

 6. Aw, this was an exceptionally good post. Taking the time and actual effort to make a very good
  article… but what can I say… I put things off a whole lot and
  never manage to get nearly anything done.

 7. Wow, amazing blog layout! How long have you been blogging for?
  you made blogging look easy. The overall look of your web site is great,
  let alone the content!

 8. Its such as you learn my thoughts! You appear to understand
  a lot approximately this, like you wrote the e-book in it or something.

  I believe that you simply can do with a few % to drive the message home a little bit,
  however instead of that, this is great blog. A fantastic
  read. I will definitely be back.

 9. Hey there! I know this is kind of off topic but I was wondering which blog platform are you using for this
  site? I’m getting tired of WordPress because I’ve
  had issues with hackers and I’m looking at options for another platform.

  I would be fantastic if you could point me in the direction of a good platform.

 10. Hey there I am so glad I found your webpage, I really found you by
  mistake, while I was browsing on Bing for something else, Regardless I am here
  now and would just like to say thanks for a incredible post and a all round entertaining blog (I
  also love the theme/design), I don’t have time to read it all at the
  minute but I have bookmarked it and also added
  your RSS feeds, so when I have time I will be back to read
  a lot more, Please do keep up the fantastic work.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here