ఐక్య రాజ్య సమితిచే గుర్తించబడిన స్మారక దినం. ఇది ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ జన్మదినం అయిన అక్టోబరు 2వ తేదీన జరుపుకొంటారు. 15 జూన్‌ 2007 వ తేదీన ఐక్య రాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ అక్టోబరు 2 రోజును అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవంగా జరుపుకోడానికి నిర్ణయించింది.

ఈ రోజున సభ్యదేశాలను తగురీతిగా సత్యాగ్రహం నినాదాన్ని ప్రజలందరికీ తెలియజేయవలసిందిగా చెప్పింది. సత్యాగ్రహం అంటే సత్యం కోసం జరిపే పోరాటం. అహింస మూలధర్మంగా, సహాయ నిరాకరణ, ఉపవాసదీక్ష ఆయుధాలుగా చేసే ధర్మపోరాటమే ఈ సత్యాగ్రహం.

మహాత్మా గాంధీ సెప్టెంబరు 11, 1906న దక్షిణ ఆఫ్రికాలో దీనిని ప్రారంభించాడు. అంతేకాక స్వాతంత్య్రోద్యమ సమయంలో ఇది ప్రముఖ పాత్ర పోషించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పౌర హక్కుల ఉద్యమ కాలంలో ఈ ఉద్యమం మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ను కూడా ఈ ఉద్యమం బాగా ప్రభావితం చేసింది. గౌతమ బుద్ధుడు ప్రవచించిన అహింసా పరమోధర్మ అన్న సూత్రం, యేసు క్రీస్తు అన్నట్టు, ఒక చెంపపై కొడితే మరో చెంప చూపమన్న ఆలోచనా ధృక్పథం దీనిలో కనిపిస్తాయి. సత్యం కోసం రాజీ లేని పోరాటమే సత్యాగ్రహం.

బాపూజీ చూపిన సత్యం, అహింస మార్గాలు భావితరాలకు బంగారు బాటగా లచాయి. సత్యాగ్రహ్నా ఆయుధంగా చేసుకొ బాపూజీబ్రిటిష్‌ ప్రభుత్వ్నా గడగడలాడించడంతో భారత దేశాకి స్వాతంత్య్రం లభించింది. కాగా ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే రక్తపాత రహితంగా ఒక సుదీర్ఘ పోరాటం ఫలితంగా స్వాతంత్య్న్రా పొందిన ఘనత కేవలం భారతదేశాకి మాత్రమే దక్కుతుంది.

ఒక సామాన్య కుటుంబంలో జ్మంచిన బాపూజీ తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి భారత దేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన స్ధాన్నా సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. ఐక్యరాజ్య సమితి కూడా మహాత్మడి జన్మదినోత్సవ్నా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించడం భారతీయులకు ఎంతో గర్వ కారణం.

1 COMMENT

  1. Do you have a spam problem on this blog; I also am a blogger, and I was wondering your situation; many of us have created some nice practices and we are looking to swap strategies with other folks, be sure to shoot me an e-mail if interested.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here