• బస్సు లోయలో పడి పది మందికిపైగా దుర్మరణం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడి పది మందికిపైగా దుర్మరణం చెందినట్లు సమాచారం. శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోరన్‌ నుంచి పూంఛ్‌ వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు మండి ప్రాంతంలో రోడ్డుపై నుంచి జారిపడి పక్కనే ఉన్న లోతైన లోయలో పడింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే సహాయకచర్యలు చేపట్టారు.

సమాచారమందుకున్న పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు పది మందికిపైగా మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే, మృతుల సంఖ్యపై ఇప్పుడే స్పష్టతకు రాలేమని పోలీసులు చెబుతున్నారు. మరికొందరు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here