న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లోని 15 పరుగులు కలుపుకుంటే భారత్ ఆధిక్యం 166 పరుగులకు చేరుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన లోకేశ్ రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసి అవుటవగా, మురళీ విజయ్(18) రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు.

తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో చతేశ్వర్ పుజారా మరోమారు నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం 40 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కెప్టెన్ కోహ్లీ 34 పరుగులు చేసి లియాన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అజింక్య రహానే ఒక పరుగుతో క్రీజులో ఉన్నాడు. అంతకుముందు 191/7 స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కంగారూలు 235 పరుగులకు ఆలౌటయ్యారు. భారత బౌలర్లకు ఎదురొడ్డిన ట్రావిస్ హెడ్ 72 పరుగులు చేశాడు. పీటర్ హ్యాండ్స్ కోంబ్ 34 పరుగులు చేశాడు.

జట్టులో మిగతా ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. భారత బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మ, షమీ రెండేసి వికెట్లు తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here