• పనులకు సహకరించాలన్న మంత్రి

మచిలీపట్నం, డిసెంబర్ 27 (న్యూస్‌టైమ్): మచిలీపట్నంలో పెద్ద ఎత్తున చేపట్టిన డ్రైనేజీ అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని రాష్ట్ర న్యాయ, యువజన సంక్షేమం, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. గురువారం స్థానిక 26వ వార్డు కాలేఖాన్‌పేట ఎస్సీ కాలనీలో 34.84 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు, 27వ వార్డు పరిధిలోని శారదానగర్‌లో తొమ్మిది లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రహదారులు, కాలువల అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలలో అభివృద్ధి పనులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.