విశాఖపట్నం, డిసెంబర్ 28 (న్యూస్‌టైమ్): పాత్రికేయుల సంక్షేమ కార్యక్రమాలకు మారుపేరుగా నిలిచినా వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరమ్ (విజెఎఫ్) మరో మారు జనవరి 2 నుంచి క్రీడా సంబరాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వైజాగ్‌ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. విజెఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 2 నుంచి 7 వరకు ఇంటర్ మీడియా స్పోర్ట్స్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

విశాఖ పోర్ట్, రైల్వే మైదానంల్లో క్రికెట్ పోటీలు జరుగుతాయన్నారు. ఫైనల్ పోటీలు జనవరి 7న జరుగుతాయన్నారు. ఇండోర్ గేమ్స్ రెండు రోజులు జనవరి 2, 3 తేదీల్లో జరుగుతాయని వివరించారు. ఈ పోటీల్లో పాల్గొనదలచిన పాత్రికేయులు తమ పేర్లు విజెఎఫ్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యాలయంలో అందించాలన్నారు. ఈ విలేకరుల సమావేశం స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ సోడిశెట్టి దుర్గారావు మాట్లాడుతూ పాత్రికేయులు క్రీడా స్పూర్తితో పాల్గొనాలని, మీడియా సంస్థలు తమ సంస్థ జట్లు ఉన్నట్టయితే ఈ పోటీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాత్రికేయుల సంక్షేమం కోసం ప్రస్తుత కమిటీ శక్తికి మించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, వాటిని సంపూర్ణంగా వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వీజెఎఫ్‌ ఉపాధ్యక్షులు ఆర్‌. నాగరాజు పట్నాయక్‌, వి.జె.ఎఫ్‌. జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌, పాలకవర్గ సభ్యులు ఎం.ఎస్‌.ఆర్‌. ప్రసాద్‌, ఇరోతి ఈశ్వరరావు, శేఖరమంత్రి, మాధవరావు, గయాజ్‌, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here