విజయవాడ, డిసెంబర్ 28 (న్యూస్‌టైమ్): కృష్ణా జిల్లా కంకిపాడు మార్కెట్ యార్డ్‌లో కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ఆదరణ పథకం-2 ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చేతులమీదుగా పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం పేదరికంపై గెలుపు కోసం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. చేతివృత్తులకు జీవం పోయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆలోచన అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన బీసీ లబ్దిదారులందరికీ ఆదరణ పథకం కింద ఉపకరణాలను పంపిణీ చేయనున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here