అమరావతి, డిసెంబర్ 28 (న్యూస్‌టైమ్): పిబ్రవరి ఒకటో తేదీ నుంచి జంబ్లింగ్‌ పద్ధతిలో జిల్లాలోనే ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు పక్కాగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 96 ప్రయోగ పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేయగా వీటితోపాటు కళాశాలల్లో ఉన్న లేబరేటరీలు, విద్యార్థులతో ప్రయోగాలు చేయిస్తున్న విధానాన్ని పరిశీలించడానికి ఆర్‌.ఐ.ఒ సీఎస్‌ఎస్‌ఎన్‌ రెడ్డి కమిటీలు ఏర్పాటు చేశారు.