rajinikanth's petta movie spot stills

కథలో కొత్తదనం ఉన్న సినిమా ఏ భాషలో వచ్చినా తెలుగు నిర్మాతల దృష్టి దానిపై పడడం సర్వసాధారణంగా మారింది. హీరో, హీరోయిన్లతో సంబంధం లేకుండానే కొన్ని పరభాషా చిత్రాలు తెలుగులో రీమేక్ అవుతుండడం, అనువాదం అవుతుండడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తమిళం, కన్నడం, మళయాళం వంటి చిత్రాలు ఎక్కువగా తెలుగులో వస్తుంటాయి.

ఇదే క్రమంలో ప్రముఖ నిర్మాత అశోక్ వల్లభనేని రజనీకాంత్ ‘పేట’ తెలుగు రైట్స్ సొంతం చేసుకున్నారు. ఈయన గతంలో విజయ్ నటించిన ‘సర్కార్’, మణిరత్నం రూపొందించిన ‘నవాబ్’ సినిమా హక్కులను తెలుగులో దక్కించుకున్నారు. ఆయనే ఇప్పుడు ‘పేట’ తెలుగు హక్కులనూ భారీ రేటుకు సొంతం చేసుకున్నారు. అశోక్ ‘పేట’ కోసం ఏకంగా 21 కోట్ల రూపాయలు పెట్టుపడి పెట్టినట్లు సమాచారం.

భారీ పోటీ మధ్య ఈ డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఈ సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేయాల‌ని చూస్తున్నారు ఈ నిర్మాత‌. తెలుగులో ఈ చిత్రాన్ని భారీగా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు నిర్మాత అశోక్. ‘పేట’ సినిమా ర‌జినీకాంత్, కార్తిక్ సుబ్బ‌రాజ్ కాంబినేష‌న్‌లో వ‌స్తోంది. సూపర్ స్టార్‌కు తెలుగులో ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమాకు హెల్ప్ కానుందని నిర్మాత నమ్మకం.

రజినీకాంత్ ఈ సినిమా కోసం చాలా మేకోవర్ అయ్యారు. ఇదివరకు ఏ సినిమాలో కనిపించని విధంగా ఇందులో కొత్తగా ఉన్నారు సూపర్ స్టార్. సిమ్రాన్, త్రిష, విజయ్ సేతుపతి, బాబీ సింహా, శ‌శికుమార్, మేఘా ఆకాష్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ‘పేట’ సినిమాతోనే దక్షిణాది సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించింది. జనవరి 10న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here