• నెలకు రూ.130తో బుల్లితెర వినోదం

 • వంద ఉచిత ఛానళ్లతో ఆనందమయం

 • ఎంచుకునే వాటికే ఆపరేటర్లకు చెల్లింపులు

హైదరాబాద్, డిసెంబర్ 28 (న్యూస్‌టైమ్): బుల్లితెర వినోదం ఇక మరింత సరసమైన ధరకు లభించనుంది. ఇంత వరకూ అవసరం ఉన్నా లేకున్నా వందలకు వందలు ఖర్చుచేసిన వినియోగదారుడిని రారాజును చేస్తూ టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈనెల 29 నుంచి ఎంచుకున్న ఛానళ్లకు మాత్రమే చెల్లింపులు జరిపే వెసులుబాటు కలిగింది. కొత్త కేబుల్‌ ఛానళ్ల విధానంతో ఈ పద్ధతి మారనుంది.

ఇష్టమైన ఛానళ్లకే డబ్బు చెల్లించి వాటిని మాత్రమే వీక్షించే అవకాశం వినియోగదారులకు దక్కనుంది. ఈ నెల 29 నుంచి అమల్లోకి రానున్న కొత్త విధానంలో వంద దాకా ఉచిత ఛానళ్లకుతోడు, మనం డబ్బులు చెల్లించిన ఛానళ్లే ప్రసారం కానున్నాయి. ఇందులో కుటుంబ సభ్యుల అభిరుచి, ఇష్టాయిష్టాలను బట్టి ఎంచుకొని చూసే అవకాశం ఉంది. ఇకపై టెలివిజన్‌ ప్రేక్షకులు తాము ఏయే ఛానళ్లు చూడాలనుకుంటున్నారో వాటికి మాత్రమే డబ్బులు చెల్లించే సరికొత్త విధానాన్ని భారత టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) అమల్లోకి తీసుకొస్తోంది.

ఈ కొత్త విధానం ఈనెల 29 నుంచి (శనివారం) ప్రారంభం కానుంది. దీని ప్రకారం వినియోగదారుడు నెలకు కనిష్ఠంగా రూ.130 (పన్నులు అదనం) చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో 100 ఉచిత ఛానళ్లు అందుబాటులో ఉంటాయి. ఇవి కాకుండా చెల్లింపు ఛానళ్ల కోసం వినియోగదారులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సినిమాలు, క్రీడలు, వార్తలు, ఇతర వినోద ఛానళ్లను చెల్లింపు విభాగంలోకి వస్తాయి. వాటికి చందాదారులుగా మారితేనే వీక్షించే అవకాశం ఉంటుంది. చెల్లింపు ఛానళ్లకు ఒక్కోదానికి ఒక్కోధర ఉంది. ఏ ఛానల్‌ కావాలని కోరుకుంటే, వాటికి మాత్రమే డబ్బులు చెల్లించి చూడొచ్చు.

చెల్లింపు టీవీ ఛానళ్లకు గరిష్ఠ చిల్లర ధర ఎంతనేది తెలుసుకునేందుకు ట్రాయ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చు. లేదా ఇప్పటికే పలు ఛానళ్లలో ధరల వివరాల్ని ప్రసారం చేస్తుండటాన్ని గమనించవచ్చు. డిసెంబర్‌ 28 అర్ధరాత్రి తర్వాత ఉచిత ఛానళ్లు మాత్రమే ప్రసారమవుతాయి. దేశవ్యాప్తంగా డీటీహెచ్‌, కేబుల్‌ కనెక్షన్లు అన్నింటికీ ఈనెల 28వ తేదీయే తుది గడువు. 28వ తేదీతో ఛానళ్ల ప్రసారం ఆగిపోవద్దనుకుంటే వీక్షించాలనుకుంటున్న చెల్లింపు ఛానళ్లకు సంబంధించిన జాబితాను స్థానిక కేబుల్‌ ఆపరేటర్‌కు ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ పద్ధతి వల్ల సగటు వినియోగదారుడు ప్రస్తుతం తాను చెల్లిస్తున్నదానికన్నా రెట్టింపు వ్యయం చేయాల్సి వస్తుందనేది కేబుల్‌ ఆపరేటర్ల వాదన. అయితే, ప్రస్తుత కేబుల్‌ వ్యవస్థ ద్వారా ప్రసారమయ్యే వందకుపైగా ఛానళ్లలో వీక్షకులు అనునిత్యం చూసేవి కొన్నే ఉంటాయని, మిగతావన్నీ వృథాయేనని, ఇకపై అవసరమైన వాటిని మాత్రమే ఎంచుకుని చూసే అవకాశం దక్కుతుందని పలువురు వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 90 శాతం మంది ప్రేక్షకులు తెలుగు ఛానళ్లు మాత్రమే వీక్షిస్తారని, కేబుల్‌ టీవీలో వచ్చే ఇతర ఛానళ్లన్నీ ఇతర భాషలకు, అంశాలకు సంబంధించినవేనని, వాటిని చూసే అవసరం ఎప్పుడో తప్ప రాదని భావిస్తున్నారు.

కుటుంబ సభ్యుల్లో పిల్లలు, వృద్ధులు, యుక్తవయస్కులకు అభిరుచుల వారీగా అవసరమైన ఛానళ్లనే ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. కొత్త విధానంలో వందదాకా ఉచిత ఛానళ్లు ప్రసారమవుతూనే, అదనపు చెల్లింపుతో అవసరమైన చెల్లింపు ఛానళ్లు మాత్రమే రావడం వల్ల అనవసరపు ఖర్చుల భారం ఉండదనే అభిప్రాయాలూ ఉన్నాయి.

22 COMMENTS

 1. I just want to tell you that I am just newbie to blogging and site-building and truly enjoyed your web site. Probably I’m want to bookmark your blog . You amazingly come with tremendous stories. With thanks for sharing with us your web-site.

 2. I want to start website very soon but I need to know certain costs. What factors did you have to pay for when you started up our website?. . How much was a website designer?. How much was your domain name?. What is your monthly rent for the domain name?. How much do you pay to servers per month?. How much does it cost you now?. Any additional fees?. . I’d love to hear all different answers and please give any advice if you can. 10 Points best answer!.

 3. Hi all! I want to have my own website let’s say i will purchase it through Godaddy and for designing part i want to use joomla. I have gone through guidance file given within joomla setup but still m confused in how to link my domain name and joomla?. Pls help me in this regard and give possible best suggestions. ..

 4. I have actually been a yahoo users for some years currently. I am only beginning to use the devices which they provide, one of which being article. I have actually written a blog site as well as wants to recognize if my post are being seen by others. Otherwise then does anybody recognize how I get my articles review.

 5. If somebody like Julia Roberts or Natalie Portman had an individual blog where they posted pictures of their vacations or something, would certainly you still take them seriously as actors? Do you assume celebrities with individual blogs are less reputable as well as taken less seriously than those that do not? Moreover, would certainly you visit their blogs to see what they are up to?.

 6. Fantastic blog, Simply wanted in order to remark will not necessarily hook up to the actual really simply syndication supply, you might want set up the best wordpress plugin for that in order to workthat.

 7. Heya i am for the first time here. I found this board and I in finding It truly helpful & it helped me out a lot. I hope to present something back and help others such as you helped me.

 8. Thank you a lot for sharing this with all of us you really understand what you are talking approximately! Bookmarked. Please additionally visit my website =). We will have a hyperlink trade arrangement among us!

 9. I’m not that much of a internet reader to be honest but your blogs really nice, keep it up! I’ll go ahead and bookmark your website to come back down the road. Many thanks

 10. I am brand-new to blog site registrations as well as I am looking for a simple reader that is nice and organized that allows me see my blogs from my homepage or has a little scrollbox that is always up on the side of the computer system screen. I started to make use of bloglines yet it is really messy with all the blog site names lined up on the side. Many thanks a whole lot!.

 11. I love reviewing individual blogs, Mother blog sites, and so on. What is the very best method to find these sorts of blogs online? The very best approach I have is simply complying with faves people have – going to one blog owners “faves” then the next blog owners favorites, etc … I’ve attempted Google Blogsearch however all that gives me is old newspaper article, etc. Absolutely nothing personal whatsoever … How do you look for individual blogs?.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here