పురుషులకన్నా మహిళల్లోనే జ్ఞాపకశక్తి చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఏదైనా అంశంపై గుర్తుంచుకునేందుకు పురుషులకన్నా మహిళలే ఎక్కువగా గుర్తుంచుకుంటారని తమ పరిశోధనల్లో తేలిందని యూనివర్శిటీ ఆఫ్‌ లండన్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు. పురుషుల్లో వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని, అదే మహిళల్లో వయసుతోపాటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని తమ పరిశోధనల్లో తేలిందని వారు వెల్లడించారు. పురుషులు, మహిళల్లో జ్ఞాపకశక్తిని అంచనా వేసేందుకు 50 సంవత్సరాలకన్నా ఎక్కువగానున్న వయసు కలిగిన పది వేలమందిని తాము అధ్యయనం చేసినట్లు పరిశోధకులు తెలిపారు. తమ పరిశోధనల్లో వారి స్మరణశక్తి సామర్థ్యాన్ని పరిశీలించామని, కాని మహిళల్లో వయసుతోపాటే జ్ఞాపకశక్తి పెరిగినట్లు తమ పరిశోధనల్లో తేలిందని జేన్‌ ఎలియట్‌ తెలిపారు.

ఇందులో ప్రధానంగా వారిలోని హార్మోన్‌ ఓస్ట్రోజన్‌ ప్రభావమేనని ఆమె తెలిపారు. తమ ఈ అధ్యయనంలో పదివేలమందిపై విద్య, వ్యక్తిగత సంబంధాలు, బంధువర్గం, చికిత్స తదితర అంశాలపై అధ్యయనం చేసినట్లు ఆమె వెల్లడించారు. 1958లో ఒకే వారంలో పుట్టిన వారిలో 50 సంవత్సరాలు పూర్తయిన వారిని తమ ఈ అధ్యయనాలకు ఎంపిక చేసుకున్నామని ఆమె తెలిపారు. వారిలోని స్మరణశక్తిని అంచనా వేసేందుకు తాము పలురకాలుగా పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ప్రతి రోజు పది శబ్దాలు ఇచ్చి ఐదు నిమిషాల తర్వాత ఆలోచించుకుని రాయాల్సివుంటుంది. తొలిసారి నిర్వహించిన పరీక్షలో పురుషులకన్నా మహిళలే ఐదు శాతం ఎక్కువ మార్కులు కొట్టేశారు.

అదే రెండవసారి పెట్టిన పరీక్షలోను మహిళలే ఎనిమిది శాతం మార్కులు కొట్టేశారు. మూడవసారి నిర్వహించిన పరీక్షలోను పురుషులకన్నా మహిళలే పరీక్షను పూర్తి చేశారని ఆమె వివరించారు. మహిళల్లో జ్ఞాపకశక్తికి ప్రధాన కారణం హార్మోన్ల ప్రభావంతోపాటు వారిలోనున్న సెక్స్‌ హార్మోన్‌ ఓస్ట్రోజన్‌ కూడా ఇందుకు చాలా తోడ్పడుతుందని తమ అధ్యయనాల్లో తేలినట్లు ఆమె తెలిపారు. కాగా, చర్మకాంతిని మెరుగు పరచుకునేందుకు రాత్రి వేళలో పడుకునే ముందు తప్పనిసరిగా ముఖాన్ని శుభ్రపరచుకోండి. దీనికోసం సబ్బును ఉపయోగించకూడదు. సబ్బులో ఉండే గాఢ రసాయనాలు చర్మానికి హాని చేస్తాయి.

చర్మకాంతి కోసం సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ పది చుక్కలు లేదా నువ్వుల నూనెలో రెండు చెంచాల పాలను కలిపి ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమం పొడి చర్మంకల వారికి బాగా ఉపయోగపడుతుంది. పుదీనా పేస్ట్‌లో బాదం నూనె కలుపుకోండి. విూ మిశ్రమంలో తగినంత వేడినీటిలో కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే చర్మకాంతి పెరుగుతుంది. కాగా, పొడి చర్మం కలవారు, కాంతివంతంగా తయారవ్వాలంటే.. ఒక టీస్పూన్‌ తేనె, అంతే మోతాదులో నిమ్మరసం, వెజిటబుల్‌ ఆయిల్‌లను కలిపి ముఖానికి, మెడకు పూసి పది నిమిషాలపాటు అలాగే ఉంచేయాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

వెజిటబుల్‌ ఆయిల్‌ అంటే… కొబ్బరి, వేరుశెనగ, నువ్వులు, సన్‌ ఫ్లవర్‌, సోయా… అలా ఏవైనా సరే, అందుబాటులో ఉన్న ఆయిల్‌ను పొడి చర్మంగలవారు తయారు చేసుకునే పేస్‌ ప్యాక్‌లో వాడుకోవచ్చు. అలాగే… ఒక టీస్పూన్‌ తేనెలో అంతే మోతాదులో పాలు కలిపి ముఖానికి అప్లయి చేసి పదినిమిషాలపాటు అలాగే ఉంచేయాలి. ఆ తరువాత మంచినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తున్నట్లయితే… పొడిచర్మం కాంతివంతంగా తయారవుతుంది. బాలింతలూ డైటింగ్‌ చేస్తున్నారా? విూరు ఓ బిడ్డకు తల్లి అయ్యారా? లేదా డెలివరీతో ఊబకాయం బాధపడుతూ డైటింగ్‌ చేయాలంటూ ప్రతీరోజూ ఏవేవో జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అయితే ఇవన్నీ పక్కనబెట్టి కాయగూరలను మాత్రం ఆహారంలో ఎక్కువ మోతాదు చేర్చుకుంటే చాలునని డైట్‌ సైంటిస్టులు చెపుతున్నారు.

ఓ బిడ్డ పుట్టిన తర్వాత మహిళలు సాధారణంగా కాస్త లావు కావడం సహజమే. కన్జూమింగ్‌ ఫుడ్‌ తీసుకోవడం ద్వారా మహిళలు ఆ సమయంలో కాస్త పుష్టిగా తయారవుతారు. కానీ శరీరాకృతి పెరిగిపోవడంపై బాలింతలు బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు రోజు వారీ ఆహారంలో పండ్లు, కాయగూరలు తీసుకుంటే చాలునని డచ్‌ సైంటిస్టులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో డచ్‌ సైంటిస్టులు జరిపిన ఓ పరిశోధనలో 80 శాతం మంది బాలింతలు కాయగూరలను తినడం ద్వారా కాల్షియం, మాగ్నీషియం వంటివి లభించి, తమ తమ శరీరాకృతి తగ్గించుకున్నారని తేలింది. అలాగే అరటి పండ్లు, పొటాటో వంటివి తీసుకోవడం ద్వారా బాలింతల శరీరాకృతి పెరిగిపోతుందని కనిపెట్టారు. పండ్లు, కాయగూరలు, అన్నం వంటి తొమ్మిది వారాల తీసుకున్న మహిళలు తమ శరీరాకృతిని తగ్గించుకున్నారని పరిశోధనలో తేలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here