• సంస్కృతుల్ని బట్టి అర్ధాలు మారే చిహ్నాలు

జైపూర్, డిసెంబర్ 29 (న్యూస్‌టైమ్‌): పంచ బిందు పచ్చబొట్టు అనేది ఐదు బిందువులు కలిగిన జ్యామితీయ అమరిక కలిగిన పచ్చబొట్టు. దీనిని చేతి వెలుపలి తలంపై బొటనవ్రేలు, చూపుడువ్రేలు మధ్య వేస్తారు. ఈ పచ్చబొట్టు వివిధ సంస్కృతులలో వివిధ అర్థాన్నిచ్చేదిగా ఉంటుంది.

ఇది వివిధ ప్రాంతాలలో సంతానోత్పత్తి చిహ్నంగా వాడబడింది. కొన్నిప్రాంఆలలో మహిళలు, పోలీసులతో ఎలా వ్యవహరించాలో తెలియజేయుటకు సూచికగా వాడేవారు. రొమానీ ప్రజలను గుర్తించేందుకు చిహ్నంగా కూడా ఈ పచ్చబొట్టును వాడుతారు. ఈ పచ్చబొట్టును అతి సన్నిహిత స్నేహితుల సమూహానికి గుర్తుగా కూడా వాడుతారు.

ప్రపంచంలో ఒంటరిగా ఉండేవారికి గుర్తుగా వాడుతారు లేదా కారాగార వాసంలో గడుపేవారికి గుర్తుగా కూడా వాడుతారు (బయటి నాలుగు బిందువులు కారాగారం బయటి గోడలను సూచిస్తే మధ్యలో గల బిందువు ఖైదీని సూచిస్తుంది). థామస్‌ అల్వా ఎడిసన్‌ అనే ప్రసిద్ధ శాస్త్రవేత్త ఈ పచ్చబొట్లు వేసే యంత్రాన్ని కనుగొన్నాడు.ఆయన తన మోచేతిపై కూడా ఈ పచ్చబొట్టును వేసుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here