అమరావతి, డిసెంబర్ 31 (న్యూస్‌టైమ్): ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలపై నిరసన పెల్లుబికింది. సోమవారం టీడీపీ నేతల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనాలు, దున్నపోతుకు కేసీఆర్‌ చిత్రపటం తగిలించి నల్లరిబ్బన్లను మూతికి కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు.

చంద్రబాబునాయుడుపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మండల పార్టీ అధ్యక్షుడు రామినేని రాజశేఖర్‌ ఆధ్వర్యంలో కొండపల్లిలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు జంపాల సీతారామయ్య మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో తొమ్మిదేళ్లు, విభజన అంధ్రప్రదేశ్‌కు నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబునాయుడును ప్రపంచం అంతా ఉత్తమ రాజకీయనాయకుడిగా కీర్తిస్తున్నాయన్నారు. ప్రజల అభ్యున్నతికి నిత్యం పరితపించే చంద్రబాబు నాయుడుపై కేసీఆర్‌ అక్కసుతోనే ఆరోపణలు చేయడం తగదన్నారు.

బీజేపీకి అద్దెమైకు లాంటి కేసీఆర్‌ టీడీపీని అధికారంలోకి రాకుండా చేసి కేంద్రంలో చక్రం తిప్పేందుకు వ్యూహంలో భాగంగానే చంద్రబాబును టార్గెట్‌ చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో చట్టుకుదురు శ్రీనివాసరావు, డాక్టర్‌ గంగా మధుసూదనరావు, సాకిరి వెంకటనర్సయ్య, నిమ్మల రాజు, దొడ్డాకుల వెంకటేశ్వరరావు, మల్లెంపూడి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ ఆధ్వర్యంలో మూలపాడు సెంటర్‌లో కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా నాయకుడు గరికపాటి శ్రీనివాసరావు, గరికపాటి శివ మాట్లాడుతూ కేసీఆర్‌ అహంకార ధోరణితో మాట్లాడటం అవివేకమన్నారు. మూరకొండ నాగేశ్వరరావు, ఏసుబాబు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చంద్రబాబునాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here