విశాఖపట్నం, జనవరి 1 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయంలో క్యాలెండర్‌ను వర్సిటీ వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు మంగళవారం ఉదయం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం వర్సిటీ రెక్టార్‌ ఆచార్య ఎం.ప్రసాద రావు, రిజిస్ట్రార్‌ ఆచార్య కె.నిరంజన్‌లకు క్యాలెంటర్‌ను అందించారు.

కార్యక్రమంలో అకడమిక్‌ డీన్‌ ఆచార్య ఎం.వి.ఆర్‌ రాజు, డీన్‌ ఆచార్య టి.వెంకట క్రిష్ణ, ఏయూ బోధనేతర ఉద్యోగుల సంఘం అద్యక్షుడు డాక్టర్‌ జి.రవికుమార్‌, కార్యదర్శి ఇ.లక్ష్మణ రావు తదితరులు పాల్గొన్నారు.