విశాఖపట్నం, జనవరి 1 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానం వేదికగా నిర్వహిస్తున్న అఖిల భారత డ్వాక్రా బజార్‌ జనవరి 3వ తేదీతో ముగియనుంది. దీనితో సందర్శకుల తాకిడి పెరిగింది. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వస్తువులను కొనుగోలు చేయడానికి నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. గత కొన్ని రోజులుగా ప్రదర్శనకు సందర్శకుల తాకిడి గణనీయంగా పెరిగింది.

స్వయం సహాయక బృందాల సభ్యులు తయారు చేసిన వస్తువులు, ఉత్పత్తుల విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయి. నాణ్యమైన ఉత్పత్తులు సరసమైన ధరలకు లభించడంతో పాటు, వైవిధ్యత కలిగి ఉండటంలో పెద్దసంఖ్యలో నగరప్రజలు కొనుగోలు చేయడం జరుగుతోంది. చిన్నారులతో కలసి గడపడానికి ప్రతీరోజు సాయంత్రం ప్రత్యేక వేదికపై సాంసృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇంటిళ్లిపాది విచ్చేసి ఆనందంగా గడిపే వేదికగా ఇది నిలుస్తుంది. మంగళవారం సాయంత్రం మీనాక్షి సంగీత, నృత్య అకాడమి ప్రదర్శించిన శాస్త్రీయ, జానపద నృత్యాలు ప్రదర్శన ఆకట్టుకున్నాయి. రమేష్‌ కుమార్‌ కరోకే ట్రాక్‌ షో అలరించింది నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. సాంసృతిక వేదికపై నిత్యం జరుగుతున్న కార్యక్రమాలను తిలకించడానికి పెద్దసంఖ్యలో నగర వాసులు విచ్చేస్తున్నారు. స్వయం సహాయ బృందాల సభ్యులు తయారు చేసిన ఆహార, అలంకరణ, వస్త్ర, హస్తకళారూపాలను ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు.

మహిళా స్వావలంబనకు ప్రతీకగా సరస్‌ ఎగ్జిబిషన్‌ నిలుస్తోంది. రాష్ట్రంనుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి ఉత్పత్తులు ఇక్కడ కొలువుతీరాయి. మహిళల మనసులు దోచే వస్త్రాల నుంచి, అలంకరణ, గృహాలంకరణ వస్తువులు, ఆహార పదార్ధాలు, పచ్చళ్లు ఇక్కడ అధికంగా విక్రయాలు జరుపుకుంటున్నాయి. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు కళాకారులు నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.

హర్యానా, తెలంగాణాకు చెందిన లెదర్‌ బ్యాగులు, జూట్‌ బ్యాగులు, జార్ఘండ్‌ దుస్తులు, చిత్తూరుకు చెందిన వేపచెక్క బొమ్మలు, కేరళ కొబ్బరి నూనెలు, అరటి చిప్స్‌, హల్వా, సుగంధ ద్రవ్యాలు, మహారాష్ట్ర నుంచి తెచ్చిన మహిళల దుస్తులు, కాశ్మీర్‌ చీరలు, షాల్స్‌, డ్రస్‌ మెటీరియల్స్‌, ఉత్తరప్రదేశ్‌ చొక్కాలు, ఒరిస్సా లేస్‌ కళారూపాలు, మేఘాలయ చొక్కాలు, కుర్తాలు, మధ్యప్రదేశ్‌ చిత్రకారుని వాటర్‌ పెయింటింగ్స్‌, ఛత్తీస్‌ఘడ్‌ బొమ్మలు, చెక్కవస్తువులు, వెస్ట్‌ బెంగాల్‌ కళాకారుల కాగితం పుష్పాలు, అస్సాం కాటన్‌, సిల్క్‌ చీరలు, డిల్లీ ఆభరణాలు, ఒరిస్సా కర్రవస్తువులు, కళారూపాలు, కేరళ వెదురు రూపాలు, అస్సాం వెదురు వస్తువులు, గోల్డెన్‌గ్రాస్‌తో చేసిన వస్తువులు, ఉడెన్‌ గ్రాస్‌తో తయారు చేసిన వస్తువులు, గడ్డితో తయారు చేసిన పర్సులు తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నాయి.

దేశం నలుమూలల నుంచి 450 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు దీనిలో పాల్గొంటున్నారు. జనవరి 3వ తేదీ వరకు వస్త్ర, హస్తకళ, ఆహార ఉత్పత్తుల ప్రదర్శన విక్రయాలు జరుపుతారు. సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పోవర్టీ (సెర్ప్‌) ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.

1 COMMENT

 1. Hey,
  lately I have finished preparing my ultimate tutorial:

  +++ [Beginner’s Guide] How To Make A Website From Scratch +++

  I would really apprecaite your feedback, so I can improve my craft.

  Link: https://janzac.com/how-to-make-a-website/

  If you know someone who may benefit from reading it, I would be really grateful for sharing a link.

  Much love from Poland!
  Cheers

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here