గడచిన ఐదేళ్లుగా తెలుగు రాష్ట్రాలు సహా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలోని తెలుగు పత్రికలు, ఇంటర్నెట్ ఎడిషన్ల (న్యూస్ వెబ్‌సైట్లు/పోర్టళ్లు/వెబ్ బ్లాగుల)కు న్యూస్ కంటెంట్ అందిస్తూ వస్తున్న తెలుగు న్యూస్ ఏజెన్సీ ‘న్యూస్‌టైమ్’ ఇక నుంచి కొత్త సారధ్యంలో సరికొత్తగా చిన్న, మధ్యతరహా పత్రికలు/న్యూస్ వెబ్‌సైట్లు/పోర్టళ్లు/బ్లాగులకు సేవలందించేందుకు సిద్ధమైందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.

ఈ నేపథ్యంలో ఏజెన్సీ సేవలను సంతృప్తికరంగా ఆస్వాదించిన తర్వాతే పూర్తిస్థాయి కనెక్షన్‌ను యాక్టివేట్ చేసుకునే వెసులుబాటుతో నేటి నుంచి ప్రయోగాత్మకంగా ఉచిత సేవలను ప్రారంభించడం జరిగింది.

ఇందులో భాగంగా నేటి నుంచి వారం రోజుల పాటు ఏజెన్సీ సేవల్ని పూర్తి ఉచితంగా వినియోగించాక ప్రచురణకర్తలకు సంతృప్తి కలిగితేనే ఆ ఉచిత సర్వీసును పెయిడ్ సర్వీసుగా మార్చుకోవచ్చు.

ఈ వారం రోజుల ఉచిత వినియోగానికి సంబంధించి ప్రచురణకర్తలు (ప్రింట్ లేదా వెబ్) మా అధికారిక వెబ్‌సైట్ newstime.in ఓపెన్ చేసి పైన కనిపించే LOGIN/REGISTER లింక్ ద్వారా ఏజెన్సీ సైట్ (agency.newstime.in)లోకి ప్రవేశించాక అక్కడ కుడివైపు పైన కనిపించే Register లింక్‌ను క్లిక్ చేసి మీ సంస్థ వివరాలు, మీకు కావాల్సిన యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్ తెలియజేయడం ద్వారా ఉచిత కనెక్షన్‌ను తక్షణమే యాక్టివేట్ చేసుకోవచ్చు. మీ కనెక్షన్ యాక్టివేట్ అయిన దగ్గర నుంచి ఈనెల 10వ తేదీ వరకూ సంస్థ మీకు ఉచిత సేవల్ని అందిస్తుంది.

ముఖ్య గమనిక: దీని కోసం మీరు ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం గాని, ఎలాంటి సర్వీసు చార్జీలను గానీ చెల్లించాల్సిన పనిలేదని తెలియజేస్తున్నాము.

ధన్యవాదాలతో,
Team NT
TS&AP