విజయవాడ, జనవరి 10 (న్యూస్‌టైమ్): వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిర్వహించినది ‘ప్రజా సంకల్ప యాత్ర’ ముగింపు సభ కాదని, ఆయన పార్టీ ముగింపు యాత్ర సభ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముగింపు సభలో జగన్ పచ్చి అసత్యాలు మాట్లాడారని ఎద్దేవాచేశారు. ‘‘అది పాదయాత్ర ముగింపు సభ కాదు.

వైసీపీ పార్టీకి ముగింపు యాత్ర సభ. నీవు పాదయాత్ర చేసినా నీలో పరివర్తన రాలేదు’’ అని అన్నారు. వైసీపీ నేతల్లో అభద్రతా భావం కనిపిస్తోందని, పక్క జిల్లాలో పాదయాత్రలో ఉండి, తుఫాన్ బాధితులను పరామర్శించలేని అసమర్ధ నాయకుడు జగన్ అని విమర్శించారు. వైఎస్ హయాంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లారని, కోట్ల రూపాయల అవినీతి డబ్బుతో గెలవాలని చూస్తున్నారని దేవినేని పేర్కొన్నారు. 24 వేల కోట్ల రూపాయలతో ప్రకాశం జిల్లాలో కాగితం పరిశ్రమ, రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేసామని, వెనుకబడిన జిల్లా అనంతపురానికి ‘కియా’ కార్ల పరిశ్రమ వచ్చిందని మంత్రి చెప్పారు. మొదటి కియా కారు జనవరి 29న బయటకు రాబోతోందన్నారు.

జగన్ ఇడుపులపాయకు రాజధాని తీసుకువెళ్లాలని కుట్రలు చేస్తున్నాడని, ఇంటి ఇంటికి తాగునీరు ఇచ్చే ‘జలధార’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ‘‘నీ పాదయాత్రలో మేము చేసిన అభివృద్ధి కనపడలేదా? ఈ నెలలో 24 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నాం. జేపీ 75 వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాలని చెప్పారు. దానిపై జగన్ ఎందుకు మాట్లాడరు? అప్పుల్లో ఉన్న రాష్టాన్ని అబివృద్ది పథంలో నడిపేందుకు సీఎం కృషి చేస్తున్నారు’’ అని దేవినేని చెప్పారు. 2019 ఎన్నికలే వైసీపీకి చివరి ఎన్నికలని, ప్రజలే జగన్ మోహన్ రెడ్డికి తగిన బుద్ది చెబుతారని అన్నారు. పోలవరం ఇరిగేషన్ జాతీయ ప్రాజెక్టు గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు.

32 వేల 315.5 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయడం గొప్ప విషయమని, దేశమంతా గర్వపడి, తెలుగు వాడి సత్తాను అభినందిస్తుంటే జగన్ మాత్రం ఓర్వలేకపోతున్నాడని వ్యాఖ్యానించారు. గిన్నీస్ రికార్డు పేరుతో నాటకం అంటూ తన అవినీతి పత్రికలో విషం ‌చిమ్మడం‌ దుర్మార్గమన్నారు. వేలాది మంది కార్మికులు, ఇంజనీర్ల 24 గంటల ‌శ్రమను జగన్ అవమానించాడని, మంచిని కూడా అంగీకరించలేని మానసిక‌వ్యాధితో జగన్ బాధ పడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబును తిట్టకుండా, సీఎం సీటుపై కలలు కనకుండా జగన్‌కు రోజు గడవదన్నారు. ఎన్ని‌ అవాంతరాలు ఎదురైనా చంద్రబాబు నిధులు కేటాయించి పోలవరం పనులు పరుగులు పెట్టిస్తున్నారని, కేంద్రం నిధులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నా జగన్ నోరు తెరవడని, కోర్టులో కేసులు కూడా వేయించి పోలవరం పనులను అడ్డుకునేందుకు జగన్ అనేక కుట్రలు చేశాడని ఆరోపించారు. ఇంత నీచంగా దిగజారి జగన్ వ్యవహరించి తన నైజాన్ని బయట పెట్టుకున్నాడని, సీఎం పదవి పిచ్చి పట్టిన జగన్‌కు ఆ కుర్చీ తప్ప మంచి ఏది కనిపించడం లేదన్నారు.

నిర్వాసితులకు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా కేంద్రం నిధులు విడుదల చేయకుండా ఇబ్బందులు పెడుతుందని, మోదీని కానీ, కేంద్రాన్ని కానీ జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని మంత్రి ధ్వజమెత్తారు. మోదీ, కేసీఆర్‌లతో జగన్ లాలూచీ రాజకీయాలు చేస్తూ ఎపీ ప్రజలకు ద్రోహం చేస్తున్నాడని విమర్శించారు.

అవినీతి కేసులో ఎ1, ఎ2 ముద్దాయిలుగా ఉన్న జగన్, విజయసాయిరెడ్డి పోలవరంపై విమర్శలు చేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని పుస్తకాలు వేస్తూ దష్ప్రచారం చేస్తున్నారని, గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు, ఇంజనీర్లు, నిపుణులు సమక్షంలో పనులు‌ చేశామని, 32 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తే జగన్ తన పత్రికలో పూత అని రాయించాడని వ్యాఖ్యానించారు. తన స్వార్ధం కోసం చివరికి గిన్నీస్ రికార్డ్‌ను కూడా తప్పు పట్టేలా పిచ్చి కధనమ రాశాడన్నారు. ‘‘జగన్… ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? పట్టిసీమ లేకపోతే నేడు డెల్టా లేదు… దానిని కూడా నువ్వు సమర్ధించ లేదు’’ అని అన్నారు.

కృష్ణా డెల్టాలో రెండు పంటలతో పాటు, రాయలసీమకు నీరు ఇచ్చి చూపామని, రాయలసీమ రతనాల సీమ చేసేందుకు సీఎం తపన పడుతున్నారని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో జల హారతి ఇచ్చి చంద్రబాబు నీటిని తీసుకువస్తున్నారని, చంద్రబాబు ప్రణాళికల వల్లే నేడు అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయని, 10 వేల 449 కోట్ల రూపాయల పోలవరం పనులు చేస్తే 25వేల కోట్లు అవినీతి జరిగిందని అసత్యాలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మోదీ, కేసీఆర్ డైరెక్షన్‌లో జగన్ చంద్రబాబుపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘నీలాంటి వాళ్లు ఎంతమంది అడ్డుపడినా చంద్రబాబు పోలవరం పూర్తి చేసి రైతాంగానికి కానుకగా అందిస్తారు’’ అని మంత్రి స్పష్టంచేశారు.

2 COMMENTS

 1. Hey,
  lately I have finished preparing my ultimate tutorial:

  +++ [Beginner’s Guide] How To Make A Website From Scratch +++

  I would really apprecaite your feedback, so I can improve my craft.

  Link: https://janzac.com/how-to-make-a-website/

  If you know someone who may benefit from reading it, I would be really grateful for sharing a link.

  Much love from Poland!
  Cheers

 2. Hello. I have checked your newstime.in and i see
  you’ve got some duplicate content so probably it is the reason that you
  don’t rank hi in google. But you can fix this issue fast. There is a tool
  that rewrites content like human, just search in google: miftolo’s tools

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here