• అపార్ట్‌మెంట్ల నిర్మాణం కోసం చండీగఢ్‌కు భూమి కేటాయింపు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (న్యూస్‌టైమ్): కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) ఉద్యోగులకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ హౌసింగ్ స్కీమ్‌లో భాగంగా 3930 మంది అలాటీలకు అపార్ట్‌మెంట్‌లను నిర్మించేందుకుగాను చండీగఢ్ హౌసింగ్ బోర్డుకు భూమి కేటాయించాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. చండీగఢ్ పాలనయంత్రాంగ ఉద్యోగుల కోసం ‘సెల్ఫ్- ఫైనాన్సింగ్ హౌసింగ్ స్కీమ్- 2008’ పేరు తో ఒక పథకానికి చండీగఢ్ పాలనయంత్రాంగం ఇదివరకే ఆమోదముద్ర వేసింది. దీనికి అనుగుణంగా, యూటీ ఉద్యోగుల కోసం 3930 నివాస యూనిట్లను నిర్మించడానికి మొత్తం 73.3 ఎకరాల భూమిని కేంద్రం కేటాయించింది.

ఇందులో 11.8 ఎకరాల భూమి ఇప్పటికే చండీగఢ్ హౌసింగ్ బోర్డు స్వాధీనంలో ఉంది. ప్రస్తుత ప్రతిపాదనలో, 61.5 ఎకరాల ప్రభుత్వ భూమిని చండీగఢ్ హౌసింగ్ బోర్డుకు కేటాయించవలసివుంది. చండీగఢ్ హౌసింగ్ బోర్డును పైన పేర్కొన్న పథకం అమలుకుగాను నోడల్ ఏజెన్సీగా కేంద్రం నియమించింది. దీని ప్రకారం, చండీగఢ్ హౌసింగ్ బోర్డు ‘సెల్ఫ్- ఫైనాన్సింగ్ హౌసింగ్ స్కీమ్’ పేరుతో చండీగఢ్ పాలనయంత్రాంగ ఉద్యోగుల కోసం ఒక పథకాన్ని 99 సంత్సరాల పాటు లీజ్ హోల్డ్ ప్రాతిపదికన 2008వ సంవత్సరంలోనే ప్రకటించింది.

ప్రస్తుత ప్రతిపాదన చండీగఢ్ పాలనయంత్రాంగ ఉద్యోగులకు ఫ్లాట్ల నిర్మాణానికి ఉద్దేశించింది కావడంతో, ఈ ప్రోజెక్టు ఖజానాపై భారాన్ని వేయకుండానే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పించగలుగుతుంది. ఇంజినీర్లకు సైతం ఉద్యోగ అవకాశాలు లభించే ఆస్కారం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here