ఘజియాబాద్, ఫిబ్రవరి 28 (న్యూస్‌టైమ్): రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్‌టిఎస్) కింద ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.30,274 కోట్ల అంచనా వ్యయంతో 82.15 కిలోమీటర్ల నిడివి గల (68.03 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్, 14.12 కిలోమీటర్ల భూగర్భ కారిడార్) ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్‌టిఎస్) నిర్మాణానికి అనుమతి మంజూరుచేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. గ్రాంటుగాను, సబార్డినేట్ రుణంగాను రూ.5634 కోట్లు కేంద్ర ఆర్థిక సహాయం అందించనుంది.

ప్రాజెక్టు వ్యవస్థాత్మక ఏర్పాట్లు, లీగల్ అవసరాలతో పాటు ప్రాజెక్టు అనుమతికి షరతులు సరళీకృతం చేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలోనే రైలు ర‌వాణాతో కూడిన అత్యంత వేగ‌వంత‌మైన ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించే తొలి ఆర్ఆర్‌టిఎస్ ప్రాజెక్టు ఇది. పూర్తి స్థాయిలో అమ‌లులోకి వ‌చ్చిన‌ట్ట‌యితే జాతీయ రాజ‌ధాని మండ‌లి (ఎన్‌సిఆర్) ప్రాంతంలో ప్ర‌యాణికుల ర‌వాణాకు అత్యంత వేగ‌వంత‌మైన, సౌక‌ర్య‌వంత‌మైన, సుర‌క్షిత‌మైన ర‌వాణా వ్య‌వ‌స్థ‌గా మారుతుంది.

డిజైనింగ్, టెక్నాల‌జీ, వ్య‌వ‌స్థాత్మక నిర్వ‌హ‌ణా విధానాల్లో వినూత్న విధానాల‌తో ఇతర ర‌వాణా వ్య‌వ‌స్థ‌ల‌ను కూడా స‌మీకృతం చేసుకుంటూ నిర్మాణం అయ్యే ప్రాజెక్టు ఇది. జోరుగా సాగుతున్న అభివృద్ధి, భారీగా పెరిగిపోయిన ప్రైవేటు వాహ‌నాల కార‌ణంగా మౌలిక వ‌స‌తులు, పారిశ్రామిక కార్య‌క‌లాపాల‌పై వ‌త్తిడిని త‌గ్గించి ప‌ట్టణ ర‌వాణా వ్య‌వ‌స్థ స్వ‌రూపాన్ని మార్చి వేయగల ప్రాజెక్టు ఆర్ఆర్‌టిఎస్. దీని ద్వారా ప్ర‌జ‌ల‌కు పూర్తి సుర‌క్షితంగా అమిత వేగంగా ప్ర‌యాణం చేయగల విశ్వ‌స‌నీయ‌మైన, సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌భుత్వ ర‌వాణా స‌దుపాయం అందుబాటులోకి వ‌స్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here