The Governor of Andhra Pradesh and Telangana, E.S.L. Narasimhan presenting the memento to the Union Home Minister, Rajnath Singh at the inauguration of Office and Residential Complex at the National Investigation Agency, Hyderabad, Telangana on March 01, 2019.

హైదరాబాద్, మార్చి 1 (న్యూస్‌టైమ్): ఉగ్ర‌వాద చ‌ర్య‌ల ద‌ర్యాప్తు లో జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) ఎంతో ప్ర‌భావంతంగా ప‌ని చేస్తోంద‌ని కేంద్ర హోం వ్య‌వ‌హారాల శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. హైద‌రాబాద్‌, గౌహ‌తిల‌లోని ఎన్ఐఎ కార్యాల‌యం, సిబ్బంది గృహాల స‌ముదాయాన్నీ ఏక కాలంలో మంత్రి హైద‌రాబాద్‌లో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 2009లో ఏర్పాటైన ఈ సంస్థ‌కు ఇటీవ‌లి కాలంలో ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌కు సంబంధించిన అనేక కేసుల‌ను అప్ప‌చెప్తున్నామ‌ని అన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ, ఈ సంస్థ కు అప్ప‌గించిన 249 కేసులలో, 180 కేసుల‌లో చార్జిషీట్లు ఫైల్ చేశార‌ని ఆయ‌న అన్నారు. ఈ సంస్థ చేప‌ట్టిన కేసుల‌లో 92 శాతం కేసుల‌లో నేరాలు నిర్ధార‌ణ జ‌రిగి, శిక్ష‌లు విధించ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న అన్నారు. మ‌న దేశంలోనే గాక‌, విదేశాల‌లో ఉన్న ఉగ్ర‌వాద సంస్థ‌లైన హిజ్‌బుల్ ముజుహుదీన్‌, ల‌ష్క‌ర్‌-ఎ-తైబా వంటి సంస్థ‌ల చ‌ర్య‌ల‌ను విదేశీ సంస్థ‌ల‌తో క‌ల‌సి ఎన్ఐఎ ద‌ర్యాప్తు చేస్తోంద‌ని, మంత్రి అన్నారు. హైద‌రాబాద్‌లో 2013 లో జ‌రిగిన జంట పేలుళ్ళు, ప‌ఠాన్‌కోఠ్‌లో జ‌న‌వ‌రి 2017లో జ‌రిగిన పేలుళ్ళు వంటి క్లిష్ట‌మైన కేసుల‌ను ఎన్ఐఎ చేధించింద‌ని ఆయ‌న తెలిపారు.

ఇటీవ‌ల ఫుల్వామాలో జ‌రిగిన ఘ‌ట‌న గురించి మాట్లాడుతూ ప్ర‌ధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎంతో స‌మ‌ర్ధ‌వంతంగా పాక్ దుశ్చ‌ర్య‌ల‌ను భార‌త్ ఎదుర్కొంద‌నీ, ప్ర‌పంచ దేశాలు మ‌న‌కు బాస‌టగా ఉన్నాయ‌నీ సింగ్ అన్నారు. ఇందుకు నిద‌ర్శ‌నంగా ఇస్లామిక్ దేశాల స‌మావేశానికి మొట్ట‌మొద‌టిసారి మ‌న విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్‌ను గౌర‌వ అతిథిగా ఆహ్వానించార‌ని మంత్రి అన్నారు.

కేంద్ర హోం శాఖ, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ప‌గించిన కేసుల‌నే గాక‌, ఎన్ఐఎ కొన్ని కేసుల ద‌ర్యాప్తు చేప‌డుతుంద‌నీ, దొంగ నోట్ల చెలామ‌ణీ, ఉగ్ర‌వాద సంస్థ‌ ల‌కు ఆర్థిక స‌హాయం అంద‌జేస్తున్న సంస్థ‌ల ద‌ర్యాప్తు కూడా ఎన్ఐఎ చేప‌డుతుంది. ఈ సంస్థకు ముంబయి, హైద‌రాబాద్‌, ల‌క్నో, కోచ్చి, గువాహ‌టి, కోల్‌క‌తా, రాయ్‌పూర్‌, జ‌మ్ముల‌లో కార్యాల‌యాలు ఉన్నాయని చెప్పారు.

ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ ఇ.ఎస్.ఎల్. న‌ర‌సింహ‌న్‌, తెలంగాణ హోం శాఖ మంత్రి మొహ‌మూద్ ఆలీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఎన్ఐఎ, డీఐజీ వై.సి. మోదీ స్వాగ‌తోప‌న్యాసం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here