విశాఖపట్నం, మార్చి 5 (న్యూస్‌టైమ్): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖ జిల్లా పెదగంట్యాడ మండల శివారు సముద్ర తీరంలోని అప్పికొండ శివాలయం వద్ద వేలాదిగా సముద్ర స్నానానికి తరలి వచ్చిన భక్తులకు గాజువాక జనసేన వీర మహిళా నాయకులు కాదంబరి సుహాసిని ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గం నాయకులు గాజువాక తొలి శాసనసభ్యుడు చింతలపూడి వెంకటరామయ్య ముఖ్య అతిథిగా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద భక్తులకు టీ, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

అదే విధంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసు గుర్తు ప్రచారం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను మేనిఫెస్టోను కరపత్రాల అందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక జనసేన వీర మహిళలు కడవలి ఉమా, భవాని, లక్ష్మీ, జనసేన నాయకులు డీపీఆర్ చందు, కిల్లని నాయుడు, బలిరెడ్డి నాగేశ్వరరావు, కాకి మధు, గారు కొండలరావు, కర్రి శ్రీకాంత్, ముతకలపల్లి వంశీ, ఆర్మీ గోవిందు, యాదగిరి ప్రసాద్, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here