• రాయ్‌బరేలీ నుంచి సోనియాగాంధీ

  • అమేథీ నుంచి పోటీచేయనున్న రాహుల్

న్యూఢిల్లీ, మార్చి 7 (న్యూస్‌టైమ్): సమీపిస్తున్న సార్వత్రిక ఎన్నికలకు విపక్ష కాంగ్రెస్ పార్టీ ముందుగానే సిద్ధమైంది. అధికార భారతీయ జనతా పార్టీతో పోల్చుకుంటే కాంగ్రెస్ ముందుగానే పోటీచేయనున్న అభ్యర్ధుల తొలి జాబితాను వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ తొలి జాబితాను ప్రకటించింది. మొత్తం 15 స్థానాలతో తొలి జాబితాను గురువారం ఇక్కడ విడుదల చేసింది.

ఉత్తర ప్రదేశ్‌లో 11 స్థానాలు, గుజరాత్‌లో 4 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ రాయ్‌బరేలి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయనుండగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నారు. యూపీ (పశ్చిమ) కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్న ప్రియాంక గాంధీ పేరు తొలి జాబితాలో లేదు.