ఇస్లామాబాద్, మార్చి 7 (న్యూస్‌టైమ్): భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ దాడులు కొత్తేమీ కాదని చెప్పుకొచ్చారు. తన హయాంలో కూడా జైషే భారత్‌పై దాడులకు తెగబడిందన్నారు. నిఘా సంస్థల సూచనల మేరకు మసూద్ అజర్ సారథ్యంలోని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ భారత్‌లో దాడులు జరిపిందని ముషారఫ్ అంగీకరించారు.

ప్రస్తుతం దుబాయిలో ఉన్న ముషారఫ్ గురువారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను అణచివేసేందుకు తన హయాంలో పటిష్టవంతమైన చర్యలు చేపట్టానన్నారు. కానీ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేయడం ద్వారా తనను అంతమొందించేందుకు ప్రయత్నించారని చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడితో జైషేపై చర్యలు చేపట్టిన పాక్ ఇంతకుముందే ఆ చర్యలు తీసుకొనాల్సిందని వ్యాఖ్యానించారు.

‘‘నేను దేశాధ్యక్షుడిగా ఉన్నప్పటి పరిస్థితులు వేరు. భారత్‌పై దెబ్బకు దెబ్బ అన్నట్లు పాక్ నిఘా సంస్థల అధికారులు వ్యవహరించే వారు. ఉగ్రవాద చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. జైషేపై పెద్దగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. నేను కూడా ఒత్తిడి తేలేదు’’ అని ముషారఫ్ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here