విశాఖపట్నం, మార్చి 16 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జరుగుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలను వర్సిటీ వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు శనివారం సాయంత్రం పరిశీలించారు. వర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల, ఆర్ట్స్‌ కళాశాల, యోగా కేంద్రం తదితర ప్రాంతాలలో జరుగుతున్న నిర్మాణాల ప్రగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. పనుల నాణ్యత, జరుగుతున్న విధానాన్ని సమీక్షించారు.

నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ, సకాలంలో నిర్మాణాలు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. వీసీ వెంట చీఫ్‌ ఇంజనీర్‌ ఎం.జి మాధవ బాబు తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here