హైదరాబాద్, మార్చి 17 (న్యూస్‌టైమ్): గోవా ముఖ్యమంత్రి, కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్ మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంతాపం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ అకౌంట్ ద్వారా తన సంతాపాన్ని ప్రకటించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

మనోహర్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు కూడా సంతాపం తెలిపారు. గత ఏడాది మార్చిలో మనోహర్ క్లోమగ్రంథి సమస్య బారిన పడ్డారు. క్లోమగ్రంథి సమస్యకు ఆయన అమెరికాలో చికిత్స చేయించుకున్నారు. సెప్టెంబర్‌లో భారత్ వచ్చి ఢిల్లీ ఎయిమ్స్‌లో పారికర్ చికిత్స పొందారు.

గోవాలోని మపూసాలో మనోహర్ పారికర్ జన్మించారు. ఐఐటీ బాంబేలో పారికర్ ఇంజినీరింగ్ మెటలర్జీ చదివారు. హైస్కూల్‌లో చదివేటప్పుడే మనోహర్ ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. 2014-17 మధ్య రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా మనోహర్ పనిచేశారు. మూడు సార్లు గోవాకు సీఎంగా పనిచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here