కాంగో, మార్చి 18 (న్యూస్‌టైమ్): కాంగో దేశాన్ని వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 24 మంది మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇదే ఘటనలో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. కాంగోలోని కసాయ్‌ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలు తప్పడంతోనే ఈ దుర్ఘటన సంభవించినట్లు అధికారులు ప్రాధమికంగా నిర్ధారించారు.

ఈ క్రమంలో కొన్ని బోగీలు పక్కనే ఉన్న నదిలో పడ్డాయని అధికారులు తెలిపారు. సిబ్బంది బృందాలు ఘటనా స్థలానికి చేరకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన అధికారులు క్షతగాత్రులను సమీపంలోని స్థానిక ఆసుపత్రులకు తీసుకువెళ్లారు. నెల వ్యవధిలో కాంగోలో ఇది మూడో రైలు ప్రమాదం కావడం గమనార్హం. గత నెలలో జరిగిన ఓ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here