మచిలీపట్నం, మార్చి 18 (న్యూస్‌టైమ్): సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు సోమవారం జిల్లాలో ముగ్గురు నామినేషన్ల దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.

పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్దిగా బొడే ప్రసాద్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయగా బొడే హేమాచౌదరి ఇండిపెండెంటుగా రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. గుడివాడ నియోజకవర్గంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ అభ్యర్దిగా గుండపనేని రాజకుమారి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here